close
Choose your channels

24 ఏళ్ల త‌ర్వాత క్రేజీ కాంబినేష‌న్‌లో...

Tuesday, December 10, 2019 • తెలుగు Comments

24 ఏళ్ల త‌ర్వాత క్రేజీ కాంబినేష‌న్‌లో...

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 168వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్‌పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. డిసెంబ‌ర్ నెలాఖ‌రున సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఈసినిమాలో న‌టీన‌టుల‌ను చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఖ‌రారు చేస్తుంది. ఇప్ప‌టికే క‌మెడియ‌న్ సూరి, హీరోయిన్ కీర్తి సురేశ్ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నార‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

కాగా ఇప్పుడు సీనియ‌ర్ న‌టి, హీరోయిన్ మీనా కూడా ఈ చిత్రంలో న‌టిస్తుంద‌ని స‌మాచారం. అయితే మీనా ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తుంద‌నే దానిపై మాత్రం నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. 24 ఏళ్ల త‌ర్వాత అంటే ముత్తు చిత్రం త‌ర్వాత ర‌జినీకాంత్‌, మీనా కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్ర‌మిదే అవుతుంది.  ఈ చితానికి  ‘వ్యూహం’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

ప్రస్తుతం రజినీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్‌'. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది.  ఇందులో రజినీకాంత ఆదిత్య అరుణాచలం అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో కూడా విడుదలైంది. త్వరలోనే రజినీకాంత్‌ రాజకీయ రంగ  ప్రవేశం చేయనున్నాడనే వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఆయన తన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

Get Breaking News Alerts From IndiaGlitz