close
Choose your channels

కోవిడ్ ఎఫెక్ట్‌... ‘పుష్ప’ షూటింగ్ క్యాన్సిల్‌

Thursday, December 3, 2020 • తెలుగు Comments

కోవిడ్ ఎఫెక్ట్‌... ‘పుష్ప’ షూటింగ్ క్యాన్సిల్‌

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. ప్యాన్ ఇండియా చిత్రంగా ఐదు భాష‌ల్లో రూపొందుతోన్న‌ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌.రీసెంట్‌గానే రాజమండ్రికి సమీపంలో ఉండే మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభ‌మైంది. ప్రస్తుతం సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న గుస గుస‌ల ప్ర‌కారం ఈ సినిమా షూటింగ్‌ను క్యాన్సిల్ చేశార‌ట‌. అందుకు కార‌ణం.. క‌రోనా వైర‌స్‌. త‌క్కువ మందితో షూటింగ్స్ చేసుకోండంటూ ప్ర‌భుత్వం అనుమ‌తిని ఇచ్చింది. అయితే పుష్ప యూనిట్ మాత్రం భారీ సంఖ్య‌లో.. మెంబ‌ర్స్‌తో షూటింగ్‌ను స్టార్ట్ చేసింది. చివ‌రికి ఎవ‌రికో క‌రోనా వ‌చ్చి.. ప్రాణాల మీద‌కు వ‌చ్చినంత ప‌నైంద‌ట‌. దీంతో నిర్మాత‌లు షూటింగ్‌ను క్యాన్సిల్ చేసేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

చిత్తూరు జిల్లాశేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మగ్లింగ్‌పైనే ఈసినిమా ప్ర‌ధాన కథాంశం ర‌న్ అవుతుంది. ఇందులో బ‌న్నీ పాత్ర‌ను.. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ చేసే కూలీగా చేరి త‌ర్వాత లారీ డ్రైవ‌ర్‌గా మారి, త‌ర్వాత పెద్ద స్మ‌గ్ల‌ర్ రేంజ్‌కు ఎలా చేరుకున్నాడ‌నేలా సుక్కు తీర్చిదిద్దార‌ట‌.

Get Breaking News Alerts From IndiaGlitz