close
Choose your channels

BiggBoss: ఐకానిక్ ఇన్సిడెంట్స్‌ మరోసారి చూపిన కంటెస్టెంట్స్ , ఏం జీవించారబ్బా..!!

Saturday, December 10, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐకానిక్ ఇన్సిడెంట్స్‌ మరోసారి చూపిన కంటెస్టెంట్స్ , ఏం జీవించారబ్బా..!!

బిగ్‌బాస్ తెలుగు 6 మరికొద్దిరోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ వారం మొత్తం ప్రైజ్‌మనీని తిరిగి సంపాదించుకునే టాస్క్‌లు ఇస్తూ కంటెంట్ రాబడుతున్నాడు బిగ్‌బాస్. ముఖ్యంగా దెయ్యాల గది ఛాలెంజ్ ప్రేక్షకులకు ఫన్ అందిస్తోంది. ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయా, రేవంత్, రోహిత్‌లు ఇప్పటికే కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లగా... నిన్నటి ఎపిసోడ్‌లో శ్రీసత్య ఆ గదిలోకి వెళ్లడానికి వణికిపోయింది. ఇంటి సభ్యులంతా లోపలికి తోస్తున్నా ఆమె వెళ్లనంటే వెళ్లనని గడప దగ్గరే కూలబడిపోయింది. నిన్నటి వరకు ఇంటి సభ్యులంతా కష్టపడి ప్రైజ్‌మనీని రూ.46,00,000కు చేర్చారు. మరి అది రూ.50,00,000 చేరుకుంటుందో లేదో చూడాలి.

శ్రీసత్య వెళ్లనంటే వెళ్లనని అనడంతో ఆమెను గదిలోకి లాక్కొచ్చే పని మొదలుపెట్టాడు బిగ్‌బాస్. నీకు తోడుగా కీర్తిని పంపుతానని చెప్పడంతో ఇక తప్పదనుకుని శ్రీసత్య ధైర్యం చేసి కన్ఫెషన్ రూమ్‌కి అడుగుపెట్టింది. వీళ్లిద్దరూ గడ్డిని చూసి కూడా వణికిపోయారు. ‘‘సత్య రా’’ అంటూ బిగ్‌బాస్ హస్కీ వాయిస్‌తో భయపెట్టడంతో... ‘‘నేను రాను’’ అంటూ శ్రీసత్య వణుకుతూ చెప్పడం ఫన్నీగా అనిపించింది. కీర్తి మాత్రం కాసేపు భయపడకుండా నవ్వుతూ కనిపించగా, దెయ్యం గెటప్ వేసుకున్న వ్యక్తిని చూసి సత్య కేకలు వేయడంతో కీర్తి కూడా జడుసుకుంది. చివరికి ఎలాగోలా బిగ్‌బాస్ తెచ్చిన వస్తువు తీసుకురావడంతో వీరికి రూ.20 వేలు ఇచ్చాడు.

తర్వాత బయట వున్న వాళ్లని కూడా కన్ఫెషన్ రూంలోకి రమ్మని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో దొరికిందే సందుగా ఇనయా, కీర్తి దెయ్యల్లా భయపెడుతూ అందరినీ ఓ ఆటాడుకున్నారు. బిగ్‌బాస్ వెతకమన్న టోపీని తీసుకుని ఎట్టకేలకు బయటకు వచ్చేశారు. దీంతో ఇంటి సభ్యులకు రూ.13 వేలు ఇచ్చాడు. అనంతరం మనీబాల్ ఛాలెంజ్‌లో రేవంత్‌ రూ.500, రోహిత్ రూ.1500 సాధించాడు.

అనంతరం బిగ్‌బాస్ ఈ సీజన్‌లో జరిగిన సంఘటనలను రీక్రియేట్ చేసి... తనను అలరించాలని ఆదేశించాడు. దీంతో శ్రీహాన్‌కు క్రేజ్ తీసుకొచ్చిన పిట్టగొడ గొడవను ప్రదర్శించాడు. ఇందులో శ్రీసత్య ఇనయాలాగా, రేవంత్ శ్రీహాన్‌గా నటించారు. వీరిద్దరూ జీవించేశారు. అలాగే అప్పటి ఘటనలో గీతూలాగా ఇనయా నటించి ఎంటర్‌టైన్ చేసింది. తర్వాత వరుసగా హోటల్ టాస్క్‌లో అర్జున్ - శ్రీసత్య మధ్య కుదిరిన ఒప్పందం, అర్జున్ - రేవంత్ మధ్య పప్పు గొడవ, మిషన్ పాజిబుల్ టాస్క్‌లో ఆదిరెడ్డి సీక్రెట్ టాస్క్, కీర్తి భట్ వేలికి గాయం, కెప్టెన్సీ టాస్క్‌లో రోహిత్ గోనె సంచులను తన్నడం ఇలాంటి ఐకానిక్ ఇన్సిడెంట్లను కంటెస్టెంట్స్‌ మరోసారి ప్రదర్శించి నవ్వించారు. వీరి నటనకు బాగా ఖుషీ అయిన బిగ్‌బాస్ రూ.43,000 ఇచ్చాడు. మొత్తంగా ఈరోజు ఇంటి సభ్యులంతా కష్టపడి ప్రైజ్‌మనీని రూ.47,00,000కు చేర్చారు. దీంతో రేవంత్ బాగా సంతోషపడ్డాడు.

ఇక ఈ వారం ఆదిరెడ్డి, రేవంత్, కీర్తి, ఇనయా, రోహిత్‌లు నామినేషన్‌లో వున్నారు. టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టడంతో శ్రీహాన్ నామినేషన్‌లో లేడు. ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ఐదుగురు ఫైనల్స్‌కి వెళతారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం శ్రీసత్య, కీర్తిలు డేంజర్ జోన్‌లో వున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ వారం ఒక్కరినే ఎలిమినేట్ చేసినా , నెక్ట్స్ వీక్ మధ్యలో మరొకరిని ఇంటి పంపాల్సి వుంటుంది. మరి తుది నిర్ణయం బిగ్‌బాస్ దే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.