Congress vs BRS:కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలాయి. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని.. 30 మోసాలు, 60 అబద్ధాలు చెప్పించారని విమర్శించారు. ప్రజాభవన్‌కు వచ్చే వారి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరని.. ఇప్పటివరకు ఎవరి సమస్యలనైనా పరిష్కరించారా?అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ.. చిన్నచిన్న సమస్యలు వస్తాయనే మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు అందజేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. వచ్చే బడ్జెట్లో దీనిని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ అభివృద్ధిపై సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తామని.. రాజకీయాలు వదిలి రాష్ట్ర ప్రగతిపై మాట్లాడదమని హితవు పలికారు.
మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మీరు ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేశారా?పదేళ్లలో నెలకు రూ.వెయ్యి ఇచ్చారా? సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారుంటూ మండిపడ్డారు.
అలాగే మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? చెప్పాలని ప్రశ్నించారు. మహిళలు బస్సుల్లో ఉచితంగా తిరిగితే మీకేంటి సమస్య? భావోద్వేగాలు రెచ్చగొట్టడమే మీ నైజం అని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో హరీష్‌రావుకు అగ్గిపుల్ల దొరక్కలేదంటూ డ్రామాలు ఆడారంటూ ఎద్దేవా చేశారు.
అంతకుముందు ఈ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో తరలివెళ్లారు. హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ఆసెంబ్లీకి వచ్చారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినా.. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సభలోకి ఫ్లకార్డులు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రికత్త నెలకొంది. అలాగే తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments