close
Choose your channels

"అన్నాత్తే రిలీజ్".. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్, అది రజనీ అంటే

Saturday, November 6, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అన్నాత్తే రిలీజ్.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్, అది రజనీ అంటే

రజనీకాంత్.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తన కృషి, పట్టుదల, కార్యదీక్షతో సాధారణ కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. రజనీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులకు ఆరోజు పండగే. ఆ రోజు ఎట్టి పరిస్ధితుల్లోనూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాల్సిందే. ఇది కోట్లాది మంది ఫ్యాన్స్ కోరిక.

అన్నాత్తే రిలీజ్.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్, అది రజనీ అంటే

ర‌జ‌నీకాంత్ సినిమా అంటే ఏ రేంజ్‌లో హంగామా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌తంలో కొన్ని సంస్థలు ఆయన సినిమా చేసేందుకు సెల‌వులు కూడా ప్ర‌క‌టించాయి. ఇప్పుడు తాజాగా సూపర్‌స్టార్ నటించిన అన్నాత్తె సినిమా కోసం చెన్నైలోని న్యూవే అనే కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అన్నాత్తేను రిలీజ్ రోజు (నవంబర్ 5న) తమ ఉద్యోగులకు ఆఫ్ డే లీవ్ ఇస్తున్నట్లుగా న్యూవే ప్రకటించింది. అంతేకాదు.. దీపావళి కానుకలుగా ఉద్యోగులకు అన్నాత్తే మూవీకి ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్లుగా చెప్పింది. ఈ విష‌యం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మిగిలిన కంపెనీల్లో పనిచేసేవారు కూడా త‌మ‌కు ఇలాంటి ఆఫ‌ర్స్ ఇస్తే బాగుండ‌ని అనుకుంటున్నారు.

అన్నాత్తే రిలీజ్.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్, అది రజనీ అంటే

ఇక అన్నా చెల్లెలు సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కిన అన్నాత్తె మూవీలో కీర్తి సురేష్.. రజినీ చెల్లెలుగా నటించింది. ఇక తలైవా సరసన సౌతిండియన్ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‏గా నటించగా.. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించారు. తొలి రోజు ఈ చిత్రం పెద్ద‌గా క‌లెక్ష‌న్స్ సాధించక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.