close
Choose your channels

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న స్టార్ క‌మెడియన్‌సునీల్‌.. ?

Wednesday, December 2, 2020 • తెలుగు Comments

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న స్టార్ క‌మెడియన్‌సునీల్‌.. ?

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు అందాల రాముడు, పూల‌రండు, మ‌ర్యాద‌రామ‌న్న వంటి రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు. అడపా దడపా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లోనూ న‌టిస్తున్నాడు. డిస్కోరాజా, క‌ల‌ర్‌ఫొటో చిత్రాల్లో సునీల్ విల‌నిజాన్ని తెర‌పై చూడొచ్చు. అయితే తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు త్వ‌ర‌లోనే సునీల్ డైరెక్ష‌న్ చేయ‌బోతున్నాడ‌ట‌. రీసెంట్‌గా ఓ మ‌రాఠి సినిమా రీమేక్ రైట్స్‌ను ద‌క్కించుకుని దాన్ని తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు మార్చి రాయిస్తున్నాడ‌ట సునీల్‌. దీనికి ఓ మంచి నిర్మాత కూడా దొరికాడ‌ని టాక్ వినిపిస్తోంది.

ఇవి కాకుండా సునీల్ హీరోగా కూడా రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఓ సినిమాను వి.ఎన్‌.ఆదిత్య డైరెక్ట్ చేస్తే అనీల్ సుంక‌ర నిర్మిస్తాడు. ఈ సినిమాలో.. ఇంతకు ముందు సునీల్‌తో మర్యాదరామన్నలో జోడీ కట్టిన సలోనియే హీరోయిన్‌గా నటించనుందని టాక్. అలాగే మ‌రో సినిమా క‌న్న‌డ రీమేక్ బెల్‌బాట‌మ్ రీమేక్‌. ఏదేమైనా ఒక వైపు యాక్ట‌ర్‌గానే కాకుండా త్వ‌ర‌లోనే టెక్నీషియ‌న్‌గానూ సునీల్ త‌న టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోనున్నాడన్న‌మాట‌.

Get Breaking News Alerts From IndiaGlitz