మనకు అన్నీ వచ్చాయి: ఏపీ సీఎం


Send us your feedback to audioarticles@vaarta.com


బడ్జెట్ కు సంబంధించి వైసీపీ చేస్తున్న విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లెక్కలు కూడా తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ కు ఏమేం కావాలో అన్నీ వచ్చాయన్నారు.
ప్రతిసారి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదని, వివిధ రంగాలకు సంబంధించి జరిగిన కేటాయింపుల్లో, ఏపీకి రావాల్సిన నిధులన్నీ వస్తాయని ఆయన అన్నారు. సరైన వ్యక్తులతో, సరైన సమయంలో, సరైన చోట ఉంటే అన్నీ వాటంతట అవే వస్తాయని వ్యాఖ్యానించారు.
భారతీయ జనతా పార్టీ తరఫున ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది 12.94 వృద్ధి రేటు సాధించామని, వచ్చే ఏడాది 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
గత పాలకుల విధ్వంసం వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటోందని అన్నారు చంద్రబాబు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ 7 నెలల్లో నిధులు అందించిందని, అమరావతిలో రాజధాని నిర్మాణంతో పాటు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు జరిగిందన్నారు.
ఏఐ, గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం, పేదరిక నిర్మూలన లాంటి విధానాల్లో అవకాశాల్ని వెంటనే అందిపుచ్చుకునే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందన్న చంద్రబాబు.. కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ లో అంతర్భాగంగానే స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం ఉందని స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com