close
Choose your channels

Chor Bazar: చోర్ బజార్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది - నిర్మాత వీఎస్ రాజు

Saturday, June 18, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా చోర్ బజార్ చిత్రాన్ని నిర్మించారు వీఎస్ రాజు. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ఈనెల 24న యూవీ క్రియేషన్స్ సమర్పణలో గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు నిర్మాత వీఎస్ రాజు.

ఆయన మాట్లాడుతూ..

మాది భీమవరం. సినిమా మీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాను. రామ్ గోపాల్  వర్మ రక్ష సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరాను. అక్కడే నాకు జీవన్ రెడ్డి పరిచయం. అలా మా మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. గుండెల్లో గోదారి, జోరు..ఇలా ఏడెనిమిది చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను.

నేను జీవన్ రెడ్డి మాట్లాడుకునేప్పుడు చాలా స్టోరీస్ వినిపించేవాడు.  అలా ఈ చోర్ బజార్ కథ చెప్పాడు. దీన్నే తన మొదటి సినిమాగా చేయమని నేను సజెస్ట్ చేశాను. కమర్షియల్ మూవీ కాబట్టి దర్శకుడిగా పేరొస్తుందని చెప్పాను. అయితే ఆయన దళం, జార్జ్ రెడ్డి చిత్రాలు తెరకెక్కించారు. ముందు ఈ సినిమాకు వేరే నిర్మాత అనుకున్నాం. బడ్జెట్ ఎక్కువవుతుందని అనిపించి మనమే చేద్దామని నిర్ణయించుకున్నాం.

చోర్ బజార్ అనేది హైదరాబాద్ లో 400 ఏళ్లుగా ఉంది. నిజాం కాలంలో దొంగతనం చేసిన వస్తువులను అక్కడ అమ్మేవారని చెబుతారు. ఇప్పటికీ అలాగే అమ్ముతుంటారు. ప్రతి గురువారం అక్కడ ఈ అమ్మకాలు జరుగుతుంటాయి. నేను మా టీమ్ కూడా చోర్ బజార్ లో వస్తువులు కొన్నాం.

ఆకాష్ ఈ కథకు పర్పెక్ట్ సరిపోయాడు. కథ విన్నాక ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నాడు. ఈ కథకు రెండు మూడు సినిమాలు చేసిన హీరోనే సరిపోతాడు. ఈ సినిమాతో ఆకాష్ కు మంచి పేరొస్తుంది. హీరోయిన్ పాత్రను మూగగా ఎఁదుకు పెట్టామనేది సినిమాలో చూడండి. ఇప్పుడున్న సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ఆ పాత్ర ద్వారా ఫన్ క్రియేట్ చేశాం.

దర్శకత్వ విభాగంలో పనిచేసినా ఈ సినిమా విషయంలో ప్రొడక్షన్ వరకే చూసుకున్నాను. కరోనా వల్ల అనుకున్న బడ్జెట్ పెరిగింది. ఇది అన్ని సినిమాలకూ జరిగింది. మేము సెట్ వేసి 4 రోజులు షూటింగ్ చేశాక సెకండ్ వేవ్ మొదలైంది. మా టీమ్ లో దర్శకత్వ శాఖలో కొందరికి, మేనేజర్ కు కొవిడ్ వచ్చింది. ఆ టైమ్ కు షూటింగ్ ఆపేశాం.

సీనియర్ నటి అర్చన గారు మదర్ పాత్రలో నటించారు. 25 ఏళ్ల తర్వాత ఆమె తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. చోర్ బజార్ రాత్రి జరిగే కథ 35 రోజుల వరకు కేవలం రాత్రి షూటింగ్ చేశాం. యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. పృథ్వీ అనే స్టంట్ మాస్టర్ ఫైట్స్ బాగా డిజైన్ చేశాడు.

సురేష్ బొబ్బిలి సంగీతం సిినిమాకు ఆకర్షణ అవుతుంది. జడ పాటకు పెద్ద హిట్ అయ్యింది. సోషల్ మీడియాలో మా చిత్ర పాటలు వైరల్ అయ్యాయి. మా జర్నీలో యూవీ క్రియేషన్స్ కలవడం ఎంతో ధైర్యాన్నిచ్చింది. వాళ్లకు సినిమా నచ్చి రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.