close
Choose your channels

చిరు 153 డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Sunday, October 13, 2019 • తెలుగు Comments

చిరు 153 డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. ఈసినిమా సెట్స్‌పైకి వెళ్ల‌క ముందే.. చిరంజీవి 153వ చిత్రానికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన `లూసిఫ‌ర్‌` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. కాగా.. తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌బోతున్నార‌ని స‌మాచారం.

ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి. మ‌రి సుకుమార్ బ‌న్నీ సినిమా కంటే ముందుగానే చిరుని డైరెక్ట్ చేస్తాడా?  లేక బ‌న్నీ సినిమా పూర్త‌యిన త‌ర్వాత డైరెక్ట్ చేస్తాడా? అనే వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో చిరుతో పాటు చ‌ర‌ణ్ కూడా న‌టిస్తాడ‌ని స‌మాచారం. ఇది క‌నుక నిజ‌మైతే మెగా ఫ్యామిలీలో చ‌ర‌ణ్ త‌ర్వాత చిరుని సుకుమార్ డైరెక్ట్ చేసిన‌ట్లే.

ప్ర‌స్తుతం చిరంజీవి `సైరా న‌ర‌సింహారెడ్డి`తో మంచి విజ‌యాన్నే ద‌క్కించుకున్నాడు. ప్యాన్ ఇండియా చిత్రంగా విడుద‌లైన సైరా 100 కోట్ల రూపాయ‌ల షేర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది. ఇప్పుడు చేయ‌బోయే కొర‌టాల సినిమాను వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz