close
Choose your channels

చిరకాల మిత్రుడు పంపిన గిఫ్ట్‌తో ఫోటో తీసుకుని మురిసిపోతున్న మెగాస్టార్..

Sunday, August 23, 2020 • తెలుగు Comments

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకో స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. అది తన చిరకాల మిత్రుడు పంపాడని.. ఆ గిఫ్ట్‌తో ఫోటో దిగి చిరు మురిసిపోయారు. ఇంతకీ ఆ చిరకాల మిత్రుడెవరో తెలుసా? మంచు మోహన్‌బాబు. నిజంగానే మోహన్‌బాబు పంపిన గిఫ్ట్ అద్భుతంగా ఉంది. ఆ గిఫ్ట్‌లో రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయని చిరు వెల్లడించారు. ‘‘నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థాంక్యూ’’ అని చిరు ట్వీట్ చేశారు.

చిరుకి మోహన్‌బాబు చెక్కతో తయారు చేసిన ఓ బుల్లెట్‌ను కానుకగా పంపారు. నిజంగానే ఆ బుల్లెట్‌లో రాజసం ఉట్టి పడుతోంది. దానిని పట్టుకుని చిరు తీసుకున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఇటు మెగాస్టార్, అటు మోహన్‌బాబు అభిమానులు స్పందిస్తున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే మోహన్‌బాబు, చిరు ట్విట్టర్ వేదికగా పన్నీ ఫన్నీ ట్వీట్స్ చేసుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తున్న విషయం తెలిసిందే.

చిరు పుట్టినరోజు సందర్భంగా మోహన్‌బాబు ట్వీట్ సైతం ఆకట్టుకుంటోంది. ‘‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్’’ అని శనివారం చిరుకి మోహన్‌బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Get Breaking News Alerts From IndiaGlitz