close
Choose your channels

నిర్మాత‌గా మారుతున్న చిరు కుమార్తె

Wednesday, July 8, 2020 • తెలుగు Comments

నిర్మాత‌గా మారుతున్న చిరు కుమార్తె

మెగాస్టార్ చిరంజీవి కుంటుంబంలో ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ నిర్మాతగా మారి వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మ‌రో నిర్మాత‌గా కూడా చేరారు. ఆమె ఎవ‌రో కాదు.. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత‌. గ‌త కొంత‌కాలంగా సుస్మిత కాస్ట్యూమ్‌ డిజైన‌ర్‌గా రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ‘ఖైదీ నంబ‌ర్ 150, సైరా న‌ర‌సింహారెడ్డి’ చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వర్క్ చేశారు. ఇప్పుడు ఈమె రూట్ నిర్మాత‌గా మార్చుకున్నారు.

నిర్మాత‌గా మారుతున్న చిరు కుమార్తె

సినీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పేరుతో బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశారు. అంతే కాకుండా ఈ బ్యాన‌ర్‌లో వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నార‌ట‌. ఓయ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆనంద రంగ ఈ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్క‌బోతున్న ఈ వెబ్ సిరీస్‌లో ఎనిమిది భాగాలుంటాయ‌ట‌. ఒక్కొక్క భాగం న‌ల‌బై నిమిషాల నిడివితో ఉంటుంద‌ట‌. దీనికి సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌జేస్తారు. మ‌రిప్పుడు సుస్మిత పూర్తిస్థాయిలో ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటారా? లేక కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా కొన‌సాగుతూ ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటారా? అనేది తెలియ‌డం లేదు.

Get Breaking News Alerts From IndiaGlitz