close
Choose your channels

లోకేష్‌ 2.0ను చూసి చంద్రబాబు హ్యాపీ.. హ్యాపీ!

Sunday, July 14, 2019 • తెలుగు Comments

లోకేష్‌ 2.0ను చూసి చంద్రబాబు హ్యాపీ.. హ్యాపీ!

ఇదేంటి.. టీడీపీ ఓడిపోయిందిగా.. పైగా కొడుకు కూడా మంగళగిరిలో అట్టర్ ప్లాప్ అయ్యారు.. మరి చంద్రబాబు హ్యాపీగా ఉండటమేంటి..? అని కాసింత ఆశ్చర్యమేస్తోంది కదూ..? అవునండోయ్ మీరు వింటున్నది నిజమే. లోకేష్ చేస్తున్న పనులకు చంద్రబాబు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారట. ఇంతకీ లోకేష్ అంతగా ఏం పనులు చేస్తున్నారు..? ఓడిన బాధను కూడా పక్కనెట్టి బాబు ఎందుకంత హ్యాపీగా ఫీలవుతున్నారో..? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

2.0గా మారిపోయిన లోకేశ్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ సైకిల్ తుక్కు తుక్కైన సంగతి తెలిసిందే. బహుశా ఈ సామాన్లన్నీ సక్రమంగా సర్ది సెట్ చేసుకునే సరికి ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం ఇక 2024, 2029లో కూడా మేమే మాకు గట్టిపోటీనిచ్చే పార్టీలేదు.. ఉన్న టీడీపీ-జనసేన కలిసినా మమ్మల్ని ఢీ కొట్టలేవు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మాత్రం మునుపటి కంటే పూర్తిగా మారిపోయి.. అదే 2.0గా తయారై.. వైసీపీపై బాణాలు ఎక్కుపెడుతున్నారు.

ఎంతైనా ఐటీ కదా..!?

ఒక్కోసారి ఈయన ట్వీట్స్ చూస్తే.. వామ్మో ఇవన్నీ నిజంగానే లోకేష్ చేస్తున్నాడా..? లేదా లక్షలిచ్చి మనుషులను పెట్టించి మరీ ఇలా రాయిస్తున్నారా..? అనే సందేహాలు రాకపోలేదు. వాస్తవానికి లోకేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకమునుపే సోషల్ మీడియా గురించి మంచి పట్టుంది.. పైగా అమెరికాలో ప్రముఖ ఐటీ సంస్థలో చినబాబు కొలువు చేసొచ్చారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అందుకే అప్పట్లో బాబు కూడా ఆయనకు ఐటీ శాఖను కట్టబెట్టారు కూడా.

విజయసాయి తప్ప ఎవరూ లేరు!

ఇక అసలు విషయానికొస్తే.. 2019 ఎన్నికల సీజన్‌ మొదలైన నాటి నుంచి లోకేష్ సోషల్ మీడియాను బాగా వాడేయడం మొదలెట్టేశారు. అదే జోరును కొనసాగిస్తూ వస్తున్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డోస్ పెంచి మరీ దుమ్ములేపుతున్నారు. అయితే ఇటు వైసీపీ తరఫున ఒకే ఒక్క విజయసాయిరెడ్డి తప్ప సోషల్ మీడియాలో స్పందించే నాధుడే లేరు.. అయితే వైసీపీ నేతలు రెండు మాటలు మాట్లాడితే లోకేష్ మాత్రం నాలుగైదు ట్వీట్స్ చేసేస్తున్నారు. మరోవైపు వైసీపీ చేస్తున్న పనులను ఎండగడుతూ.. ముఖ్యంగా బడ్జెట్ గురించి వరుస ట్వీట్లు చేసి ప్రభుత్వాన్ని ఏకిపారేయడంతో టీడీపీలో కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది.

బాబు హ్యాపీ.. హ్యాపీ..!

మొత్తానికి చూస్తే.. ఒకప్పటి లోకేష్‌ వేరు.. ఇప్పటి లోకేష్ వేరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు టీడీపీకి సైతం నోరున్న నేత ఎవరైనా ఉన్నారా అంటే ఒకటి అర తప్ప అస్సలెవ్వరూ లేరు. అయితే లోకేష్ ట్విట్టర్‌లో కౌంటర్లే కౌంటర్లు, విమర్శలకు, ప్రతి విమర్శలు, ఇలా ప్రభుత్వంపై షాకింగ్ ట్వీట్స్ చూసిన చంద్రబాబు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారట. హమ్మయ్యా.. లోకేష్ ఇప్పుడిప్పుడే ట్రాక్‌లో వస్తున్నాడు.. ఇక ఇబ్బందులు తొలగినట్లే పూర్తిగా ఫామ్‌లోకి వస్తే పార్టీ పగ్గాలు పూర్తిగా కట్టబెట్టేద్దామని భావిస్తున్నారట. సో.. లోకేష్ మార్పు టీడీపీకి మంచిదేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే లోకేష్ పరిస్థితి మున్ముంథు ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz