ఆశా వర్కర్లకు చంద్రబాబు తీపికబురు


Send us your feedback to audioarticles@vaarta.com


రాష్ట్రవ్యాప్తంగా సేవలిందిస్తున్న ఆశా వర్కర్లకు తీపికబురు అందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆశా వర్కర్లపై వరాల జల్లు కురిపించారు. ఆశా వర్కర్ల రిటైర్మెంట్ ఏజ్ ను ఏకంగా 62 ఏళ్లకు పెంచారు.
వయో పరిమితి పెంపుతో పాటు ప్రసూతి శెలవులు కూడా ప్రకటించారు. మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజుల పాటు వేతనంతో కూడిన శెలవు ఇస్తామని ప్రకటించారు. ఇక ఆశా వర్కర్లు ఎప్పట్నుంచో కోరుతున్న గ్రాట్యూటీపై కూడా స్పందించారు సీఎం.
వర్కర్లందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లిస్తామని అంగీకరించారు. దీనికి సంబంధించి త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామన్నారు ముఖ్యమంత్రి.
రాష్ట్రవ్యాప్తంగా 42వేల మందికి పైగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. వీళ్లలో గ్రామాల్లో 37 వేల మంది పనిచేస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో 5,700 మంది వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్లంతా నెలకు 10వేల రూపాయల వేతనం పొందుతున్నారు. సర్వీస్ పూర్తయ్యేనాటికి గ్రాట్యూటీ లాంటి బెనిఫిట్స్ ఇకపై వీళ్లకు దక్కబోతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com