close
Choose your channels

బాబుకు గుండె దడ పెరిగిపోయింది: విజయసాయి

Wednesday, October 16, 2019 • తెలుగు Comments

బాబుకు గుండె దడ పెరిగిపోయింది: విజయసాయి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే.. పలుమార్లు చంద్రబాబుపై ట్వీట్స్ చేసిన విజయసాయి తాజాగా తీవ్రపదజాలంతో వ్యాఖ్యానించారు.‘గ్రామ సచివాలయ ఉద్యోగాలు సంపాదించుకున్న ఉత్సాహంలో ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు. వైఎస్ రైతు భరోసాలో లబ్ధిదారుల జాబితా వెలువడి గ్రామాల్లో పండగ వాతావరణం ఉంది. ఈయనేమో పులివెందుల పంచాయతీ, జె-ట్యాక్స్ అని ఏడుపు రాగాలు తీస్తుంటే క్షేత్ర స్థాయిలో తుపుక్కుమని ఊస్తున్నారు’ అని చంద్రబాబును ఉద్దేశించి.. ఆయన ట్విట్టర్‌కు ట్యాగ్ చేస్తూ విజయసాయి ట్వీట్ చేశారు.

గుండె దడ పెరిగి పోయింది!

అంతటితో ఆగని ఆయన.. ‘వైసీపీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఏపీ సీఎం జగన్ ఒక్కొక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే చంద్రబాబు, ఆయన మోచేతులు నాకే బ్యాచికి గుండె దడ పెరిగి పోయింది. జగన్ ‘మడమ తిప్పాడు’ అని కొందరు, ‘నాలుగు నెలలకే డీలాపడ్డాడు’ అని మరికొందరు సొల్లు వాగుడు వాగుతున్నారు’ అని విజయసాయి దుయ్యబట్టారు.

Get Breaking News Alerts From IndiaGlitz