ఏపీ ఉద్యోగుల కోసం బాబు మరో కృషి


Send us your feedback to audioarticles@vaarta.com


చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే, మరోవైపు కీలక నిర్ణయాలు తీసుకుంటూ, మార్పుచేర్పులు చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు.
ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా అమలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఏపీ ఉద్యోగులు.. తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆస్పత్రుల్లో కూడా చికిత్స పొందవచ్చని తెలిపారు.
ఇది ఉద్యోగులకు నిజంగా మంచి వార్త. ఎందుకంటే, ఎంతోమంది ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు తెలంగాణలో కూడా ఉన్నారు. వాళ్లు తమ హెల్త్ కార్డును ఉపయోగించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రావాల్సిన పరిస్థితి.
ఇకపై ఆ బాధ లేకుండా తెలంగాణలో కూడా గుర్తింపు పొందిన కొన్ని హాస్పిటల్స్ లో వాళ్లు ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు. ఆ బిల్లుల్ని ఆంధ్రప్రదేశ్ సర్కారుకు సమర్పించవచ్చు. ఈమేరకు తెలంగాణలో రిఫరల్ ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోను చంద్రబాబు ఆదేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com