close
Choose your channels

టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో చంద్రబాబు సన్నిహితుడు!

Friday, March 13, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో చంద్రబాబు సన్నిహితుడు!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అప్పుడెప్పుడో సార్వత్రిక ఎన్నికలకు ముందు మొదలైన చేరికలు.. స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత జోరు పెరిగాయ్. ఇప్పటికే పలువురు కీలక నేతలు.. ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరైపోయారు. చాలా మంది టీడీపీకి టాటా చెప్పేసి ఊహించని రీతిలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చేసి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. గత వారం రోజులుగా వరుసగా టీడీపీ కీలకనేతలు, ఒకప్పుడు పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలు, ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఒక్కొక్కరుగా చేరిపోతున్నారు.

కీలకనేతకు గాలం!
ఇప్పటికే కడప జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. ఈ జిల్లా తర్వాత ప్రకాశంపై వైసీపీ నేతలు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంను పార్టీలో చేర్చుకున్నారు. ఆయన అధికారికంగా రాజీనామా చేసి పార్టీలో చేరలేదు కానీ.. జగన్‌కు మద్దతిచ్చి కుమారుడు కరణం వెంకటేశ్‌ను పార్టీలో చేర్చారు. అయితే.. జిల్లా నుంచి ఇంకా పార్టీలోకి చాలా మంది ఆహ్వానించాలని భావించిన వైసీపీ ఈ క్రమంలో ఓ కీలకనేత, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేతకు అత్యంత సన్నిహితుడైన నేతకు గాలం వేసినట్లు తెలుస్తోంది.

పెద్దలకు టచ్‌లో..!
ఆ కీలక నేత, సీనియర్ నేత మరెవరో కాదు.. గత కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన శిద్ధా రాఘవరావు అని తెలియవచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రేపో మాపో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారన్నదే ఆ వార్తల సారాంశం. అంతేకాదు.. ఇప్పటికే ఆయన జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంచార్జ్ మంత్రి, వైవీ సుబ్బారెడ్డికి టచ్‌లోకి వచ్చారని విశ్వసనీయవర్గాల సమాచారం.

ఎవరీ శిద్ధా..!
శిద్ధా రాఘవరావు ప్రకాశం జిల్లాలో కీలకనేత, సీనియర్ నేత. 2004లో టీడీపీ తరపున ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిన ఆయన.. ఓటమిపాలయ్యారు. అనంతరం 2014లో దర్శి నుంచి పోటీ చేసి గెలిచి విజయం సాధించి.. చంద్రబాబు కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నారు. అలా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా.. జిల్లాలో నమ్మిన వ్యక్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఇక్కడ్నుంచి ఎన్నికలకు ముందు టీడీపీకి టాటా చెప్పి వైసీపీ తరఫున పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ చేసి గెలిచారు.

శిద్ధా టీడీపీకి టాటా చెబితే మాత్రం జిల్లాలో ఉద్ధండ నేతలంతా వీడినట్లేనని.. ఇక జిల్లా మొత్తం ఖాళీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి శిద్ధా చేరిక ఎప్పుడో...? అసలు ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరుతురాన్న పుకార్లు నిజానిజాలెంత..? అనేది తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.