మాజీ మహిళా మంత్రిపై కేసు


Send us your feedback to audioarticles@vaarta.com


వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విడదల రజినీపై కేసు నమోదు కానుంది. ఈ మేరకు ఆమెపై కేసు ఫైల్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడని చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని విడదల రజినీ చిత్రహింసలకు గురిచేశారనేది ఆమెపై ఆరోపణ. ఈ వ్యవహారం 2019లో జరిగిందని చెబుతున్నారు.
చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో 5 రోజుల పాటు తనను చిత్రహింసలు పెట్టారని, ఈమధ్య పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు పిల్లి కోటి. అయితే పోలీసుల నుంచి అతడికి సరైన స్పందన రాలేదు. దీంతో న్యాయం కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
కేసును పరిశీలించిన కోర్టు.. విడదల రజినీపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించింది. ఆమెతో పాటు ఆమె పీఏలు రామకృష్ణ, ఫణి, అప్పట్లో సీఐగా వ్యవహరించిన సూర్యనారాయణపై కూడా కేసులు నమోదు చేయాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి, దానికి సంబంధించిన వివరాల్ని కోర్టుకు సమర్పించాలని పల్నాడు పోలీసుల్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com