Kiren Rijiju;న్యాయశాఖ నుంచి కిరణ్ రిజిజును తప్పించిన మోడీ.. కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర న్యాయశాఖ బాధ్యతల నుంచి కిరణ్ రిజిజు నుంచి తప్పించారు. ఆ బాధ్యతలను కేంద్ర సహాయ మంత్రిగా వున్న అర్జున్ రామ్ మేఘవాల్‌కు అదనంగా అప్పగించారు. కిరణ్‌కు భూ విజ్ఞాన శాస్త్ర శాఖ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి గురువారం ఓ ప్రకటన వెలువడింది. ప్రధాని సిఫారసు మేరకు కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖల్లో మార్పు చేసినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. అర్జున్ రామ్ మేఘవాల్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటు భూ విజ్ఞాన శాస్త్ర శాఖ, శాస్త్ర, సాంకేతికాభివృద్ధి శాఖలను జితేంద్ర సింగ్ చూస్తుండగా.. భూ విజ్ఞాన శాస్త్ర శాఖను కిరణ్ రిజిజుకు అప్పగించారు.
కేబినెట్‌లో మార్పుల వెనుక మోడీ ఎత్తుగడ :
అయితే కేంద్ర కేబినెట్‌లో ఈ మార్పుల వెనుక మోడీ వ్యూహం వుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ ఏడాది చివరిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అర్జున్ రామ్ మేఘవాల్ రాజస్థాన్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే మోడీ కేబినెట్‌లో మార్పులు
కొలిజీయం వ్యవస్థపై కిరణ్ రిజిజు వ్యాఖ్యలు:
కాగా.. ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021 జూలై 7న తన కేబినెట్‌ను పునర్వ్యస్ధీకరించిన సంగతి తెలిసిందే. అప్పుడు 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ నాటి పరిస్ధితులు , ఎన్నికలు, రాజకీయ సమీకరణాలను దృష్టిలో వుంచుకుని మోడీ తన కేబినెట్‌లో కీలక మార్పులు చేశారు. అయితే జడ్జీల నియమాకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థపై న్యాయశాఖ మంత్రి హోదాలో కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కొలీజియం వ్యవస్థలో ప్రజాప్రతినిధులు వుండాలన్న ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అంతేకాదు.. సుప్రీంకోర్ట్, భారత ప్రభుత్వం మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో కిరణ్ రిజిజును న్యాయశాఖ నుంచి తప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout