close
Choose your channels

నటుడు బ్రహ్మాజీకి రూ.4.65 కోట్ల బంపర్ ఆఫర్.. ట్విస్ట్ ఏంటంటే..

Friday, June 18, 2021 • తెలుగు Comments

నటుడు బ్రహ్మాజీకి రూ.4.65 కోట్ల బంపర్ ఆఫర్.. ట్విస్ట్ ఏంటంటే..

టాలీవుడ్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో బ్రహ్మాజీ ఒకరు. ఎప్పుడూ బిజీగా ఉండే నటుడు ఆయన. కామెడీ మిళితం చేసిన నెగటివ్ రోల్స్ లో బ్రహ్మాజీ అద్భుతంగా నటిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ టాలీవుడ్ హీరోలందరితో సన్నిహితంగా మెలిగే నటుడు ఆయన. అయితే తాజాగా బ్రహ్మాజీకి ఓ వింత అనుభవం ఎదురైంది.

ఇదీ చదవండి: హీరోయిన్లకు పెళ్లి, గర్భం అంటే పూరికి నచ్చదట!

స్మార్ట్ ఫోన్స్ వినియోగం, ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం పెరిగాక సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. మీ మొబైల్ నంబర్ కు లక్కీ డ్రా తగిలింది. మీకు లక్షల్లో ఆఫర్ వచ్చింది. మీ బ్యాంక్ డీటెయిల్స్ పంపండి అంటూ చెత్త మెసేజ్ లు వస్తూ ఉంటాయి. వాటిని నమ్మి మోస పోతున్న అమాయకులు కూడా ఉన్నారు.

అయితే నటుడు బ్రహ్మాజీ మొబైల్ నంబర్ కు ఇలాంటి ఫ్రాడ్ మెసేజ్ ఒకటి వచ్చింది. ఆ మెసేజ్ ప్రకారం బ్రహ్మాజీ ఏకంగా రూ. 4.65 కోట్లు గెలుచుకున్నారట. డబ్బు అందుకునేందుకు వివరాలు పంపాలని ఆ మెసేజ్ లో ఉంది. దీనిపై బ్రహ్మాజీ చాలా ఫన్నీగా పోలీసులకు ట్వీట్ చేశాడు.

'సర్.. ఈ నంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. వెళ్లి డబ్బు వసూలు చేసుకోండి' అని ట్వీట్ చేశాడు. బ్రహ్మాజీ ట్వీట్ పై నెటిజన్లు చాలా ఫన్నీగా రిప్లయ్ ఇస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz