close
Choose your channels

బ్రేకింగ్ : తెలంగాణలో థియేటర్స్, స్కూల్స్, మాల్స్ బంద్

Saturday, March 14, 2020 • తెలుగు Comments

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా తెలుగు రాష్ట్రాలకు పాకిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం సాయంత్రం తెలంగాణ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ సాయంత్రం కేబినెట్ భేటీ, ఉన్నతాధికారులతో నిశితంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 31 వరకు తెలంగాణలో విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. వీటితో పాటు మాల్స్ కూడా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. సెలవుల నేపథ్యంలో టెన్త్ పరీక్షలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండటంతో దీనిపై కూడా సీఎం క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు జరుగుతాయన్నారు.

ముందస్తు జాగ్రత్తగా..
ఇకాగా.. ఇప్పటికే హైదరాబాద్‌‌లో ఒకరిద్దరు చికిత్సలు కూడా పొందుతున్నారు. నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడం.. మరోవైపు నెల్లూరు జిల్లాలో కూడా ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని తెలుగు రాష్ట్రాల జనాలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. అయితే ఈ వైరస్ ప్రభావం ఒక్క జనాల మీదే కాదు.. బిజినెస్, స్టాక్ మార్కెట్స్, థియేటర్లపై కూడా పడింది. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుందని నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ముందస్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పలు రాష్ట్రాల్లో ఇలా..
ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్కూల్స్, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని మూసివేయడం జరిగింది. ముఖ్యంగా రాజస్థాన్, బెంగళూరు, ముంబైలాంటి రద్దీ ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే.. ఇదే దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా అడుగులేసే యోచనలో ఉంది. ఇవాళ సాయంత్రం కేబినెట్ భేటీ ఏర్పాటు స్కూల్స్, షాపింగ్ మాల్స్ మూసివేత.. మరీ ముఖ్యంగా సినిమా థియేటర్ల విషయమై కూడా నిశితంగా చర్చించనుంది.

థియేటర్స్ మూసివేత
కాగా.. కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు సినిమాలు విడుదల, షూటింగ్స్‌తో ప్రారంభాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో నిర్మాతల మండలి సమావేశమై పలు విషయాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్రజ‌ల‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందుల గురించి నిశితంగా చ‌ర్చించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీలో డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్, నిర్మాతలు పాల్గొన్నారు. సినిమాల‌ విడుద‌లపై చ‌ర్చించిన త‌ర్వాత క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టడానికి తీసుకునే చ‌ర్యల్లో భాగంగా థియేట‌ర్స్‌ను మూసివేయాల‌ని ప్రభుత్వంఆదేశిస్తే ఆదేశాల‌ను పాటించ‌డానికి తాము చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని వారు పేర్కొన్నారు. అయితే అనుకున్నట్లుగానే ప్రభుత్వం థియేటర్స్ మూసేయాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా థియేటర్స్ మూతపడనున్నాయి.

ఇప్పటికే నెల్లూరులో..
ఇప్పటికే నెల్లూరులోని అన్ని థియేటర్స్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మూసివేయించిన సంగతి తెలిసిందే. అయితే రీ ఓపెన్ ఎప్పుడు చేయాలన్నది చెప్పేంతవరకూ థియేటర్స్ తెరవడానికి లేదని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా.. జనాలు ఎక్కువ మంది ఉన్న ప్రాంతాల్లో ఆయన తిరిగినా త్వరగా కరోనా సోకిపోతుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదని ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం జనసంచారం ఎక్కువ ఉండే థియేటర్స్‌ను క్లోజ్ చేయిస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz