close
Choose your channels

పీఎస్ దగ్గరే 2 వేల కోట్లంటే.. బాబు, లోకేష్‌లను విచారిస్తే..!?

Friday, February 14, 2020 • తెలుగు Comments

పీఎస్ దగ్గరే 2 వేల కోట్లంటే.. బాబు, లోకేష్‌లను విచారిస్తే..!?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అని.. అయితే ఈసారి మాత్రం ఆయన ప్రయత్నం మిస్‌ ఫైర్‌ అయ్యిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇవాళ విశాఖలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బొత్స.. చంద్రబాబు అవినీతిపరుడని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. ‘పేదల కోసం నిర్మించే ఇళ్లలో కూడా అవినీతికి పాల్పడ్డాడు. ఐటీ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై చంద్రబాబు, లోకేష్‌ ఏం సమాధానం చెబుతారు?. బాబు పర్సనల్‌ సెక్రటరీ (పీఎస్) దగ్గరే రూ.2 వేల కోట్ల అక్రమాస్తులు దొరికాయంటే.. చంద్రబాబు, లోకేష్‌లను విచారిస్తే ఆ రూ.2 వేల కోట్లకు ఇంకెన్ని సున్నాలు చేరనున్నాయో..?. తెలుగుదేశం పార్టీ అవినీతిపై సమగ్ర విచారణ జరగాలి. చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవడానికి మీడియా ముందుకు వచ్చి సమగ్ర విచారణ కోరాలి. కడిగిన ముత్యం అని చెప్పుకునే లోకేష్‌.. బయటకు రావాలి.. విచారణ జరిగితే ముత్యమో.. మసిబొగ్గో తెలుస్తుంది. పేదవాడి పొట్టకొట్టి దోచుకొని తినడం ఏం బతుకు.. ఇకనైనా చంద్రబాబు రాజకీయాలు విరమించుకుంటే మంచిది.

క్లారిటీగానే చెప్పారుగా!?
‘బాబు పర్సనల్‌ సెక్రటరీగా ఉన్న శ్రీనివాస్‌ ఇంటిపై ఐదు రోజులుగా సోదాలు చేస్తే, వారితో పాటు నారా లోకేష్‌ బినామీగా ఉన్న కిలారి రాజేష్‌ ఇంటిని కూడా సోదా చేస్తే.. పూణే, హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీ వివిధ పట్టణాల్లో సోదాలు పూర్తయిన తరువాత డిపార్టుమెంట్‌ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో సారాంశం. శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇంటిని సోదాలు చేశాం. వివిధ పట్టణాల్లో కొన్ని టీమ్‌లు పరిశీలన చేశాయి. ఆ నేపథ్యంలో మొత్తం 40 చోట్ల సోదాలు చేస్తే రూ.2 వేల కోట్లు విదేశాలకు వెళ్లి.. అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చి లావాదేవీలు జరిగి ట్యాక్స్‌లు ఎగ్గొట్టడమే కాకుండా అవినీతి కార్యక్రమాలు జరిగాయని ప్రకటన చేసింది. శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఫ్రం ఏపీ అని క్లారిటీగా చెప్పారు. అమరావతిలో రాజధాని అని చెప్పి వ్యాపార సంస్థగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందే సుమారు రూ.46 వేల కోట్లకు ఎప్పుడైతే టెండర్లు పిలిచారో.. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాం. పనులు ప్రారంభించని వాటిని రద్దు చేసి, పనులు చేపట్టిన వాటిని నిలుపుదల చేశాం. దానికి అభివృద్ధి నిరోధకులు అని మాపై నిందలు వేశారు. మాకు అభివృద్ధి కావాలి కానీ అవినీతి అవసరం లేదు. చంద్రబాబులా దోపిడీ మాకు అవసరం లేదు. రూ.100 కోట్లు దాటిని ప్రతి పనికి రివర్స్‌టెండరింగ్‌కు వెళ్తాం’ అని మరోసారి మంత్రి బొత్స చెప్పుకొచ్చారు.

ఏం సమాధానం చెబుతారు!?
ఐటీ దాడులపై చంద్రబాబు, లోకేష్‌ నోరు కూడా మెదపడం లేదు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు ఏ విధంగా దోచుకోవచ్చు అని ప్రణాళికలు సిద్ధం చేసి చంద్రబాబుకు ఇచ్చాడు. ఆ కుటుంబరావు కూడా ఇప్పుడు మాట్లాడటం లేదు. రూ.75 లక్షల నగదు, రూ. 80 లక్షల నగలు అని యనమల, అచ్చెన్నాయుడు, బోండా ఉమా మాట్లాడుతున్నారు. పర్సనల్‌ సెక్రటరీ తప్పులు అవినీతి నిరోధక శాఖకు దొరకుతాయి. ఏసీబీ కంటే ఇన్‌కం ట్రాక్స్‌ వచ్చింది. కంపెనీల మధ్యలో ఉన్నాడని పరిశీలించిన తరువాతే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దీనికి చంద్రబాబు, లోకేష్‌ ఏం సమాధానం చెబుతారు’ అని మంత్రి బొత్స డిమాండ్ చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz