close
Choose your channels

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: హైదరాబాద్‌లో మొక్కలు నాటిన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్

Monday, September 20, 2021 • తెలుగు Comments

దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతిఒక్కరిని కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ఎవరో ఒక ముగ్గురు సెలబ్రెటీలు ఖచ్చితంగా ప్రతి రోజూ మూడు మొక్కలు నాటుతూ మంచి కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు మురిసిపోతున్నారు. తాజాగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ భాగం పంచుకున్నారు.

ఆదివారం హైదరాబాద్ చేరుకున్న మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, తన లాల్ సింగ్ చద్ధా సహానటుడు, టాలీవుడ్ యువహీరో అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా అమీర్‌ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్‌లను చూశాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్‌ను అందించిన టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని అభినందించారు. మనమంతా తప్పనిసరిగా మొక్కలు నాటాలని.. వాటిని బాధ్యతగా పెంచాలని అమీర్‌ఖాన్ పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల భవిష్యత్ తరాలకు మనం జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లం అవుతామని ఆయన అన్నారు. దీనిని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రతీ ఒక్కరిని అమీర్‌ఖాన్ పిలుపునిచ్చారు.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz