close
Choose your channels

BiggBoss: ఎదురేలేని గీతూ.. వెన్నుపోటుపై రగిలిపోతున్న రేవంత్, ఇనయా ఓవరాక్షన్

Thursday, September 22, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సోమవారం నాటి జోష్‌ను కంటిన్యూ చేసేలా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ సాగుతోంది. గొడవలు, వాగ్యుద్దాలతో ఇంటి సభ్యులు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఎప్పటిలానే గీతూ రాయల్ హౌస్‌ని, జనాన్ని తనవైపు చూసేలా ఆడుతోంది. దీంతో బిగ్‌బాస్ 6 విజేత గీతూ రాయలేనంటూ అప్పుడే సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ మొదలైంది. ఇక ఇవాళ్టీ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అడవిలో టాస్క్‌లో భాగంగా దొంగలు, పోలీసులు బిగ్‌బాస్ అప్పగించిన పనిని మరిచిపోయారు. పొలీసులుగా వ్యవహరిస్తున్న వారే వస్తువులను దొంగతనం చేసి మూటకట్టుకున్నారు. ఇక మన గలాటా గీతూ అయితే కొన్ని వస్తువులను తెచ్చేసుకుంది. దీంతో బిగ్‌బాస్ మరోసారి టాస్క్ గురించి, రూల్స్ గురించి చెప్పి క్లాస్ పీకాడు.

అనంతరం గేమ్ మళ్లీ మొదలైంది. ఆరోహీ, నేహాలు కలిసి రేవంత్ బొమ్మలును కొట్టేశారు. నిజానికి వారిద్దరూ కూడా రేవంత్ టీమే. తన బొమ్మలు పోయినట్లు గమనించిన రేవంత్ నా బొమ్మలు కొట్టేసిన వారికి సిగ్గు, సెన్స్ వుండాలి అంటూ నోటికి పనిచెప్పాడు. దీనికి గీతూ బదులిస్తూ.. మీ వాళ్లే బొమ్మలు తీశారని చెప్పింది,కానీ వాళ్లెవరో మాత్రం చెప్పలేదు. దీంతో చిర్రెత్తిపోయిన రేవంత్.. ఇక నేను పోలీస్ టీమ్ గెలిచే విధంగా ఆడతానని వార్నింగ్ ఇచ్చాడు. నిద్ర పోదామనుకున్నా, కానీ నిద్రపోనంటూ శపథం చేసి.. తన దగ్గరున్న వస్తువులను పోలీస్ టీమ్‌కు ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాడు.

ఇక పోలీసులు రైడ్‌కు వెళ్లి దొంగలను పట్టుకోవచ్చు... రైడ్ చేసేందుకు ఇచ్చిన టైం ముగిసిన తర్వాత కూడా పోలీసులు అక్కడే వుంటే దొంగలు వారిని కిడ్నాప్ చేయొచ్చు. ఈ క్రమంలో స్టోర్ రూంలోకి రైడింగ్‌కి వెళ్లిన ఇనయాను దొంగలు పట్టుకున్నారు. దొంగల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆరోహిని కాలితో తన్ని, నేహా చెంప మీద కొట్టింది. దీంతో ఆమె చాలా బాధపడింది. మరోవైపు.. తన డ్రెస్‌ను ఎవరో పైకి లాగారని ఇనయా గోల చేసింది. సరిగ్గా టైం కోసం ఎదురుచూసే మన గీతూ మధ్యలో దూరింది. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ఇనయాకు వ్యతిరేకంగా మాట్లాడింది. నువ్వు తప్పు మాటలు మాట్లాడటమే కాకుండా, మాట మారుస్తున్నావంటూ క్లాస్ పీకింది. అయితే దొంగల టీమ్ గీతూ దగ్గరున్న బొమ్మల్ని కొట్టేయాలని ప్లాన్ చేసింది. కానీ దీనిని ముందే పసిగట్టిన గీతూ.. బొమ్మలు కాపాడుకునేందుకు సూర్య, శ్రీహాన్‌లకు డబ్బులు ఇచ్చింది.

ఇవాళ్టీ ఎపిసోడ్ ముగిసేనాటికి శ్రీహాన్ వద్ద 14,000... సూర్య దగ్గర 10,100.. గీతూ వద్ద పాతిక బొమ్మలు, 15,800 క్యాష్ వున్నాయి. అటు పోలీసుల టీమ్‌లో శ్రీసత్య దగ్గర గోల్డ్ కలర్ కోకోనట్ వుండటంతో ఆమె కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ఈ అడవిలో ఆట టాస్క్ ముగిసి.. ఫైనల్‌గా కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరో తెలిసే ఛాన్స్ వుంది. అయితే నాగార్జున క్లాస్ పీకినప్పటికీ ఎప్పుడూ ఆడేవారే కనిపిస్తున్నారు తప్ప... వాసంతి, కీర్తిలు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆసారి వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.