close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: దీప్తి గుర్తుల్లో షన్నూ.. హేట్ యూ అన్న సిరికి హగ్గులు, అంతలోనే షాక్

Friday, November 19, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: దీప్తి గుర్తుల్లో షన్నూ.. హేట్ యూ అన్న సిరికి హగ్గులు, అంతలోనే షాక్

బిగ్‌బాస్ 5 తెలుగులో ఈ రోజు ఎపిసోడ్ అనేక మలుపులతో సాగింది. సిరి, షణ్ముఖ్, ప్రియాంకలు తమ ప్రేమ కోసం తపిస్తున్నారు. రవికి మరోసారి పవర్ యాక్సెస్ వచ్చింది. దీనిని సన్నీకి ఇస్తే ఆయన తీసుకోనంటూ మొండికేశాడు. ఇక మానస్- యానీ మాస్టర్ మధ్య కెప్టెన్సీ కంటెండర్ అర్హత కోసం పెద్ద పోటీ జరిగింది. అంతేకాదు యానీ మాస్టర్‌కు గిఫ్ట్ వోచర్ కూడా వచ్చింది. మరి ఈ రోజు హౌస్‌లో జరిగిన సంగతులు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: దీప్తి గుర్తుల్లో షన్నూ.. హేట్ యూ అన్న సిరికి హగ్గులు, అంతలోనే షాక్

కెప్టెన్సీ పోటీదారుల అర్హత కోసం జరిగిన టాస్క్‌ సందర్భంగా హౌస్‌లో ఉన్న తొమ్మిది మంది మూడు గ్రూపులుగా విడిపోయారు. సన్నీ, మానస్‌, ప్రియాంక, కాజల్‌ ఓ గ్రూపుగా.. షణ్ముఖ్‌ సిరి మరో గ్రూపుగా.. శ్రీరామ్‌, రవి, అనీ మాస్టర్ ఇంకో గ్రూపుగా డివైడ్ అయ్యారు. సంచాలక్‌ రవిని బిగ్‌బాస్‌ .. సీక్రెట్‌ రూమ్‌లోకి పిలిపించి ఓ పవర్ ఇచ్చాడు. దాన్ని ఎవరికిస్తావో అని బిగ్‌బాస్ ఆదేశించగా సన్నీ పేరు చెప్పాడు రవి. బయటకు వచ్చి 25 బంగారు ముత్యాలు ఇస్తే ఈ పవర్ ఇస్తానని రవి బేరం పెట్టాడు. కానీ దానిని తీసుకోనని ఆయన మొండికేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: దీప్తి గుర్తుల్లో షన్నూ.. హేట్ యూ అన్న సిరికి హగ్గులు, అంతలోనే షాక్

ఇక టాస్క్‌ల్లో స్ట్రాటజీ వాడే రవి.. శ్రీరామ్, యానీలతో కలిసి గేమ్ ఆడాడు. శ్రీరామ్ తన ముత్యాలను యానీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ గ్రూప్ సభ్యులు దానిని దొంగతనంగా క్రియేట్ చేశారు. అందరూ చూస్తుండగానే శ్రీరామ్ దగ్గరి ముత్యాలను యానీ మాస్టర్ తీసేసుకుంది. అటు సన్నీ మూడాఫ్‌లో వున్నాడని అర్ధం చేసుకున్న కాజల్ ఆయనను అనుసరిస్తూ వెళ్లింది. దీనిని గమనించి సన్నీ.. నా వెనుక తోకలాగా వస్తున్నావేంటీ అంటూ కామెంట్ చేశాడు. అయితే ఇంటి సభ్యుల ముందు తనను అవమానించాడంటూ కాజల్ బాగా ఎమోషనలై ఏడ్చేసింది. ఎట్టకేలకు సన్నీ ఆమెకు సారీ చెప్పి ఓదార్చాడు. అంతేకాదు తన పవర్‌ను కూడా ఇస్తానని చెప్పాడు... కానీ కెప్టెన్ రవి అందుకు ఒప్పుకోను అన్నాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: దీప్తి గుర్తుల్లో షన్నూ.. హేట్ యూ అన్న సిరికి హగ్గులు, అంతలోనే షాక్

రవి ఇచ్చిన సూపర్ పవర్‌ను తీసుకోను అన్న సన్నీ.. చివరికి బిగ్‌బాసే స్వయంగా ఆదేశించడంతో అందులో ఉన్న విషయం చదవగా, మైనింగ్‌ వెతికే వారిలో ఒకరి స్థానంలో గోల్డ్ మైనింగ్‌ వెతికే అవకాశం వస్తుంది. శ్రీరామ్‌ నుంచి పవర్‌ని తీసుకున్న సన్నీ గోల్డ్ మైనింగ్‌లో గోల్డ్ గుండ్లు వెతికాడు. ఇందులో అత్యధికంగా ఉన్న మానస్‌, యానీ మాస్టర్ల మధ్య కెప్టెన్సీ మూడో కంటెస్టెంట్‌ కోసం పోటీ జరిగింది. అందులో భాగంగా రిబ్బన్స్ ముడేసి ఒక చివరి నుంచి మరో చివరికి త్వరగా రిబ్బన్స్ కడితే విజేత అవుతారు. ఇందులో యానీ మాస్టర్ విన్నర్‌ అయ్యారు. అంతేకాదు ఆమెకు రూ.25 వేల గిఫ్ట్ వోచర్ కూడా దక్కింది. దీంతో ఇప్పటి వరకు కెప్టెన్సీ పోటీదారులుగా ప్రియాంక, సిరి, యానీ మాస్టర్‌ నిలిచారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: దీప్తి గుర్తుల్లో షన్నూ.. హేట్ యూ అన్న సిరికి హగ్గులు, అంతలోనే షాక్

ఆ తర్వాత మానస్‌పై కామెంట్‌ చేసింది ప్రియాంక. తాను ఏం చేసినా డిస్‌కనెక్ట్ అవుతున్నాడని సన్నీతో చెప్పింది. దీంతో మానస్ హర్ట్ అయ్యాడు . తాను ఏం చేసినా ఇలానే చేస్తున్నాడని... తనని దూరం పెడుతున్నాడు అంటూ పింకీ వాపోయింది. తనకూ ఫీలింగ్స్ ఉన్నాయని కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. అనంతరం మానస్‌ గార్డెన్‌లో పడుకున్నాడు. దీనిని గమనించిన సన్నీ.. మానస్‌ని అడగ్గా.. ఎవరైనా తనను నానా మాటలు అని అలిగితే నచ్చదని స్పష్టం చేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: దీప్తి గుర్తుల్లో షన్నూ.. హేట్ యూ అన్న సిరికి హగ్గులు, అంతలోనే షాక్

మరోవైపు తనప్రియురాలు దీప్తి సునయనని పదే పదే గుర్తు చేసుకున్నాడు షణ్ముఖ్‌. ఆమె రాసిన లెటర్‌ చదువుకుని ఎమోషనల్ అయ్యాడు అది చూసి సిరి నవ్వుకుంది. ఆ తర్వాత బెడ్‌పైకి వచ్చి తను కూడా కన్నీళ్లు పెట్టుకుంది. తాను కూడా రింగ్‌ చూసుకుని శ్రీహాన్‌ను గుర్తుచేసుకుంది. `నీ ప్రాబ్లమేంట్రా` అని షణ్ముఖ్‌ అడగ్గా.. తనని అడగొద్దని చెప్పింది సిరి. దీనికి ఫీలైన ష‌ణ్ను సారీ చెప్పి హ‌గ్గిచ్చాడు. సిరి కూడా అత‌డికి హ‌గ్గిస్తూనే ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. వీరిద్దరూ కలిసిపోయారని అనుకునేలోపే సిరి అక్కడి నుంచి వెళ్లిపోవడం సస్పెన్స్ కి గురి చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Login to post comment
Cancel
Comment