close
Choose your channels

స్టార్ హీరో సినిమాలో హారిక‌

Monday, January 11, 2021 • తెలుగు Comments

స్టార్ హీరో సినిమాలో హారిక‌

దేత్త‌డి హారిక‌.. యూట్యూట్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హారిక‌కు బిగ్‌బాస్ మంచి ఇమేజ్‌నే తెచ్చిపెట్టింది. బిగ్‌బాస్ 4లో ఫైన‌ల్‌గా ఎంపికైన ఐదు మంది కంటెస్టెంట్స్‌లో హారిక ఒక‌టి. ఈ అభిజీత్ విన్న‌ర్‌గా నిలిచాడు. ఫైన‌ల్ ఎలిమినేష‌న్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన వాళ్ల‌లో హారిక ముందు వ‌రుస‌లో నిలిచింది. స‌రే పాత విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో దివి, మోన‌ల్ గ‌జ్జ‌ర్‌, అఖిల్‌, అరియానా, అవినాష్‌, అభిజిత్ ఇలా అంద‌రూ టీవీ, సినిమా రంగాల్లో అవ‌కాశాల‌ను బాగానే అందిపుచ్చుకున్నారు. అయితే హారికకు ఎవ‌రు ఎందుకు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌నే వాద‌న కూడా వినిపించింది. కానీ.. అస‌లు విష‌యం ఏంటంటే.. హారికకు కూడా మంచి అవ‌కాశ‌మే ద‌క్కింద‌ట‌.

స్టార్ హీరో సినిమాలో హారిక‌

సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు హారిక శ‌ర్వానంద్ హీరోగా రూపొందుతున్న శ్రీకారం సినిమాలో చాలా మంచి పాత్ర‌ను ద‌క్కించుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇన్నిరోజులు హారిక ఆ సినిమా షూటింగ్‌లోనే ఉంద‌ని అంటున్నారు. ఈ సినిమాకు చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంటుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని అనౌన్స్ చేస్తారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Get Breaking News Alerts From IndiaGlitz