close
Choose your channels

Bigg Boss Telugu: ఆటపాటలు, భావోద్వేగాల కలబోత .. బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే హైలైట్స్

Monday, December 19, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Bigg Boss Telugu: ఆటపాటలు, భావోద్వేగాల కలబోత .. బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే హైలైట్స్

దాదాపు 15 వారాల నుంచి ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ 6 తెలుగుకు తెరపడింది. ఈ సీజన్ విజేతగా రేవంత్ , రన్నరప్‌గా శ్రీహాన్ నిలిచారు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఆటపాటల మధ్య సందడిగా సాగింది. మాజీ కంటెస్టెంట్స్, సినీ ప్రముఖులు బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. ఈ రోజు హైలైట్స్ చూస్తే:

Bigg Boss Telugu: ఆటపాటలు, భావోద్వేగాల కలబోత .. బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే హైలైట్స్

అనంతరం నాగ్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఎలిమినేట్ అయిన ఈ సీజన్ కంటెస్టెంట్స్ అర్జున్ కల్యాణ్, వాసంతి, మెరినా, రాజ్, ఫైమా, ఆర్జే సూర్య, ఆరోహి, అభినయ, గీతూ, బాలాదిత్య, ఇనయా, షానీ, సుదీప, చంటి, నేహా చౌదరిలు ఎంట్రీ ఇచ్చి డ్యాన్సులు చేశారు. ఎలిమినేషన్ ఎపిసోడ్ నుంచి తాను కోలుకోలేదని గీతూ చెప్పింది. తర్వాత టాప్ 5 కంటెస్టెంట్స్ రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్‌ల కుటుంబ సభ్యులు కూడా ఫినాలేకు వచ్చారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి భార్య కవిత మాటలు ఆకట్టుకున్నాయి. బిగ్‌బాస్ షోకి వస్తానంటే తాను వద్దన్నని.. ఎందుకంటే ఆయనకు చాలా సిగ్గుని, బయటకు వచ్చేవారు కాదని చెప్పింది. ఆ సిగ్గుని బిగ్‌బాస్ మార్చాడని, ఇందుకు చాలా ఆనందంగా వుందని తెలిపింది.

Bigg Boss Telugu: ఆటపాటలు, భావోద్వేగాల కలబోత .. బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే హైలైట్స్

తర్వాత నాగార్జున టాప్ 5 కంటెస్టెంట్స్‌కి కిరీటాలు ఇచ్చారు. వాటిని హౌస్‌లోని ఇష్టమైన ప్లేజ్‌లో పెట్టాలని చెప్పగా.. కీర్తి, రోహిత్‌లు వీఐపీ బాల్కానీలో.. శ్రీహాన్ కిచెన్ ఏరియాలో.. రేవంత్ గార్డెన్ ఏరియాలో.. ఆదిరెడ్డి సిట్టింగ్ ఏరియాలో పెట్టారు. అనంతరం సీజన్ 6లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లలో మెరీనాకి బెస్ట్ షెఫ్, ఫైమాకి బెస్ట్ డ్యాన్సర్, శ్రీసత్యికి బెస్ట్ స్లీపర్, రాజ్‌కి బెస్ట్ గేమర్, అర్జున్‌కి బెస్ట్ లవర్ బాయ్‌ అవార్డులు ఇచ్చారు నాగ్ . అనంతరం బిగ్‌బాస్ 5 విన్నర్ వీజే సన్నీ ఎంట్రీ ఇచ్చి తన మచ్చా డైలాగ్‌తో పంచ్‌లు పేల్చాడు. ఉన్నంతసేపూ కంటెస్టెంట్స్‌లో జోష్ నింపాడు.

అనంతరం హీరో నిఖిల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆయనకు పెద్ద టాస్క్ ఇచ్చాడు నాగ్. టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిని ఎలిమినేట్ చేయాలన్నాడు. దీనిలో భాగంగా ఇంట్లోకి వెళ్లిన నిఖిల్.. రోహిత్ తలపై టోపీ పెట్టి బయటకు తీసుకుని వచ్చాడు. అనంతరం స్టేజ్ పైకి వచ్చి మాట్లాడిన రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. తన తల్లికి సారీ చెప్పి.. మెరీనాని హగ్ చేసుకున్నాడు. దీంతో ఆయన తల్లిదండ్రులు కూడా కంటతడిపెట్టారు.

Bigg Boss Telugu: ఆటపాటలు, భావోద్వేగాల కలబోత .. బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే హైలైట్స్

ఆ వెంటనే అలనాటి అగ్ర కథానాయిక రాధ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలాదిత్య తనకు రాధ అంటే ఎంత ఇష్టమో చెప్పాడు. దీంతో బాలాదిత్యకు రాధతో కలిసి స్టెప్పులు వేసే అవకాశం కల్పించాడు నాగ్. ఈ క్రమంలో రాధ జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ‘‘బీబీ జోడీ’’ షో ప్రోమోని విడుదల చేశారు. తర్వాత మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ శ్రీలీలతో కలిసి బిగ్‌బాస్ స్టేజ్‌పైకి వచ్చారు. వీరిద్దరు నటించిన ధమాకా ఈ నెల 23న రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడిన మాటలు ఆకట్టుకున్నాయి. కీర్తి వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు తగ్గుతాయని , కష్టాల్లో వున్న వారికి ధైర్యంగా ముందుకెళ్లేలా ఇన్‌స్పిరేషన్‌లా వుంటుందని అన్నాడు. రేవంత్‌లో 20 తప్పులుంటే 40 పాజిటివ్‌లు వుంటాయని చెబుతూ హౌస్‌ను వీడాడు.

Bigg Boss Telugu: ఆటపాటలు, భావోద్వేగాల కలబోత .. బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే హైలైట్స్

తర్వాత రవితేజ.. సూట్‌కేసుతో బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. ప్రైజ్ మనీలో 20 శాతం మీకేనని ఆయన ఎంత టెంప్ట్ చేసినా కీర్తి, రేవంత్, శ్రీహాన్‌లు పట్టించుకోలేదు. దానిని 30 శాతానికి పెంచినా ఎవ్వరూ మాట వినలేదు. ఆ కాసేపటికీ కీర్తి ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా తనది ఎంతో అందమైన ప్రయాణమని కీర్తి అన్నారు. టాప్ 3లో చోటు దక్కించుకోవడాన్ని మాటల్లో చెప్పలేనని ఆమె పేర్కొన్నారు.

ఇక విజేతను తేల్చే క్షణాలు ప్రారంభమయ్యాయి. శ్రీహాన్, రేవంత్‌లలో ఒకరిని విన్నర్‌గా నిలబెట్టే బాధ్యత నాగ్ తీసుకున్నారు. గోల్డెన్ బ్రీఫ్ కేస్‌తో హౌస్‌లోకి వెళ్లిన నాగ్.. ఊరించే ప్రైజ్ మనీతో వారిద్దరికి ఎరవేశారు. రూ.25 లక్షల నుంచి స్టార్ట్ చేసి.. దానిని 30 లక్షలకు తీసుకెళ్లారు. అయినప్పటికీ ఇద్దరూ తగ్గకపోవడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. చివరికి మాజీ కంటెస్టెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆఫర్ తీసుకుని సైడ్ అవ్వాలని సలహా ఇచ్చారు. దీంతో ఆలోచనలో పడ్డ శ్రీహాన్.. చివరికి తండ్రి మాట మేరకు రూ.40 లక్షలకు ఓకే చెప్పారు. ఆ వెంటనే బిగ్‌బాస్ 6 తెలుగు విజేతగా రేవంత్ నిలిచినట్లు నాగార్జున ప్రకటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.