close
Choose your channels

కొట్టుకునే వరకు వెళ్లిన రోహిత్ - ఆదిరెడ్డి.... ఈ వారం నామినేషన్స్‌లో 9 మంది

Tuesday, October 11, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొట్టుకునే వరకు వెళ్లిన రోహిత్ - ఆదిరెడ్డి.... ఈ వారం నామినేషన్స్‌లో 9 మంది

బిగ్‌బాస్‌లో సోమవారం కావడంతో ఇంటి సభ్యులు నామినేషన్లలోకి దిగారు. ఈ వారం మాత్రం ఈ ప్రక్రియ హోరాహోరిగా సాగింది. గడిచిన కొన్ని వారాలుగా సైలెంట్‌గా వుంటోన్న ఆదిరెడ్డి మాత్రం ఈరోజు రెచ్చిపోయాడు. తనలో రివ్యూలు చెప్పే టాలెంట్‌తో పాటు దూసుకుపోయే తత్వం కూడా వుందని తేల్చిచెప్పాడు. ఇంటి సభ్యులు తాను నామినేట్ చేయాలనుకుంటున్న వ్యక్తికి ముఖానికి ఫోమ్ (నురగ) పూసి రీజన్ చెప్పి నామినేట్ చేయాలి.

ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే:

కీర్తి భట్.. గీతూ, శ్రీసత్య
రోహిత్.. శ్రీహాన్, ఆదిరెడ్డి
సుదీప... ఆదిరెడ్డి, కీర్తి భట్‌
వాసంతి ... గీతూ , ఆదిరెడ్డి
శ్రీహాన్... గీతూ, రాజ్
బాలాదిత్య... గీతూ, రాజ్‌
అర్జున్ .. కీర్తి భట్, ఆదిరెడ్డి
సూర్య... గీతూ, ఆదిరెడ్డి
ఫైమా... సుదీప, బాలాదిత్య
ఇనయా.. శ్రీహాన్, కీర్తి
రాజ్.. గీతూ, బాలాదిత్య
మెరీనా.. కీర్తి, ఆదిరెడ్డి
రేవంత్.. బాలాదిత్య, సుదీప
ఆదిరెడ్డి.. మెరీనా, కీర్తిభట్
శ్రీసత్య.. కీర్తి భట్, ఆదిరెడ్డి
గీతూ... రాజ్, కీర్తి భట్

మొత్తం మీద ఈ వారం నామినేషన్‌లలో 9 మంది నిలిచారు. బాలాదిత్య, గీతూ, రాజ్, కీర్తి, సుదీప, ఆదిరెడ్డి, ఇనయా, శ్రీహాన్, అర్జున్‌లు వున్నారు.

ఇక ఈరోజు ఆదిరెడ్డి- రోహిత్‌లు కొట్టుకునే వరకు వెళ్లిపోయారు. నన్ను సరిగా ఎంటర్‌టైన్‌ చేయడం లేదు అంటున్నారు కదా. నేను వెళ్తూ.. వెళ్తూ చాలా మంది కంటే బెటర్‌గా డ్యాన్స్ వేసి చూపిస్తానని ఆదిరెడ్డి మంగమ్మ శపథం చేశాడు. సరిగ్గా అప్పుడే మెరీనా.. ఆదిరెడ్డిని నామినేట్ చేయడంతో అతను రెచ్చిపోయాడు. బై వన్ గెటు టు ఆఫర్ ఇచ్చారు కదండీ.. ఒకరికేస్తే ఇద్దరూ వచ్చేశారంటూ కామెంట్ చేశాడు. కెప్టెన్సీ సరిగా చేయలేదని రీజన్ చెప్పింది మెరీనా. ఇదే సమయంలో కిచెన్‌లో జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ అరిచాడు ఆదిరెడ్డి. మధ్యలో రోహిత్ కలగజేసుకుంటూ.. నువ్వు వాయిస్ రైజ్ చేస్తే నేనూ చేస్తానంటూ గద్దించాడు.

కొట్టుకునే వరకు వెళ్లిన రోహిత్ - ఆదిరెడ్డి.... ఈ వారం నామినేషన్స్‌లో 9 మంది

అసలు నామినేట్ చేయమని చెప్పడానికి మీరెవరు..? అంటూ గుడ్లు ఉరిమి చేస్తూ ఆదిరెడ్డిని కొట్టడానికి వెళ్లినట్లు వెళ్లాడు. ఆది కూడా తగ్గేదే లే అన్నట్లుగా వుండటంతో కొట్టుకుంటారా ఏంటి అన్నంత భయపడ్డారు ఇంటి సభ్యులు. అంతలో వాసంతి వచ్చి ఆదిరెడ్డిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. అయితే మొత్తం వ్యవహారంలో రోహిత్‌ని ఆదిరెడ్డే కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లుగా కనిపించింది. టాస్కుల్లో బాగా చేసినా.. ఎంత ఎంటర్‌టైన్ చేసినా పట్టించుకోరని, నామినేషన్స్ రోజు ఓవరాక్షన్ చేస్తేనే నాలుగు ఓట్లు పడతాయని గ్రహించిన ఆది.. స్ట్రాటజీ మార్చినట్లుగా కనిపిస్తోంది.

మరోవైపు ఇనయా - ఆర్జే సూర్యల మధ్య లవ్ ట్రాక్ ముదిరి పాకాన పడినట్లుగా కనిపిస్తోంది. అప్పటికే సూర్యపై తనకు క్రష్ వుందని చెప్పిన ఇనయా ఎలిమినేషన్ రోజున ఏడుస్తున్న అతనిని ఓదార్చి టైట్ హగ్ ఇచ్చింది. ఇక నిన్న అర్ధరాత్రి తర్వాత కూడా వీరిద్దరూ ఒకే బెడ్‌పై పడుకుని సరసాలు మొదలుపెట్టారు. ఎవరూ లేని సమయం చూసి ఆర్జే సూర్య ఇనయా తన ఒళ్లో తలపెట్టుకుట్టుకుని పడుకున్నాడు. నిన్న మొన్నటి వరకు ఇంటిలో టఫ్ ఫైట్ ఇచ్చిన ఇనయా.. ఇప్పుడు సూర్యతో రొమాన్స్‌లో మునిగి తేలుతూ వుండటంతో ఓటింగ్‌లో తేడా కొట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఆరోహి కూడా ఇలాగే సూర్యతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఎలిమినేషన్ అయ్యింది. ఇప్పుడు చూస్తుంటే ఇనయా పరిస్ధితి కూడా అలాగే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.