close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: చెంప పగిలిపోద్దంటూ సన్నీకి ప్రియా వార్నింగ్, సిరితో రవి సీక్రెట్ డీల్

Thursday, October 21, 2021 • తెలుగు Comments

 

బిగ్‌బాస్ 5 తెలుగు: చెంప పగిలిపోద్దంటూ సన్నీకి ప్రియా వార్నింగ్, సిరితో రవి సీక్రెట్ డీల్

బిగ్‌బాస్‌ 5 తెలుగులో కెప్టెన్సీ టాస్క్ ఈ రోజు కూడా ప్రారంభమైంది. ఇక అనుకున్నట్లుగానే ప్రియా- మానస్‌ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరి.. కొట్టుకునే వరకు వెళ్లింది. నువ్వేంత అంటే నువ్వేంత అనుకుంటూ ఇద్దరూ హీట్ పెంచేశారు. ఇక ఈ వారం నిన్ను తీసేస్తే, తీసేయొచ్చు అని సిరితో షణ్ముఖ్‌ అనడం వివాదాస్పదమైంది. ఇక స్పెషల్‌ గుడ్డు దొరకడంతో శ్రీరామ్‌-అనీ మాస్టర్‌ బాతు టాస్క్‌ ఆడారు. ఇందులో యానీ మాస్టర్‌ గెలిచారు. మరి ఈ కెప్టెన్సీ టాస్క్‌ల్లో ఏం జరిగింది.. ఎవరు ఎలా ఆడారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: చెంప పగిలిపోద్దంటూ సన్నీకి ప్రియా వార్నింగ్, సిరితో రవి సీక్రెట్ డీల్

44 వ రోజు కూడా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ '"బంగారు కోడిపెట్ట" కొనసాగింది. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో భాగంగా, ఎవరెక్కువ డ్రెస్సులు ధరిస్తే వాళ్లకు అదనంగా 5 గుడ్లు వస్తాయని బిగ్‌బాస్‌ మరో టాస్క్ ఇచ్చారు. దీంతో విశ్వ, కాజల్‌ పోటీ పడ్డారు. ఇంట్లో వున్న వాళ్ల దుస్తులన్నీ వీరిద్దరూ ధరించే ప్రయత్నం చేశారు. కాజల్‌ 79 దుస్తులు ధరించగా, విశ్వ 106 దుస్తులు ధరించి విజేతగా నిలిచాడు. ఫిజికల్‌ టాస్క్‌లలో తనతో ఎవ్వరూ పోటీకి రాలేరని మరోసారి నిరూపించాడు. దీంతో విశ్వకి అదనంగా ఐదు ఎగ్స్ దక్కాయి.

మళ్లీ కోడికూత వినిపించడంతో ఇంటి సభ్యులంతా గుడ్ల కోసం పోటీపడ్డారు. ఈ క్రమంలో యానీ మాస్టర్ బుట్టలో వున్న గుడ్డుని సిరి తీసుకోవడంతో ఇద్దరి మధ్యా కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ జెస్సీకి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చారు. ఎవరైనా ముగ్గురు ఇంటి సభ్యుల వద్ద గుడ్లు లేకుండా చూడాలని ... ఈ విషయాన్ని ఒకరితో పంచుకోవచ్చని చెప్పాడు. అయితే షణ్ముఖ్‌ తనకు బాగా క్లోజ్‌ అయినా, అతనికి ఈ సీక్రెట్ టాస్క్ గురించి చెప్పకుండా సిరికి వివరించాడు. దీంతో షణ్ముఖ్‌, ప్రియాంక, ప్రియల దగ్గరి నుంచి సిరి గుడ్లు కొట్టేసే ప్రయత్నం చేసింది. ఇంటి సభ్యులంతా నిద్రపోయిన తర్వాత జెస్సీ దగ్గరున్న మూడు గుడ్లను సన్నీ దొంగిలించాడు.  

బిగ్‌బాస్ 5 తెలుగు: చెంప పగిలిపోద్దంటూ సన్నీకి ప్రియా వార్నింగ్, సిరితో రవి సీక్రెట్ డీల్

మళ్లీ కోడి కూత వినిపించగానే ఎప్పటిలానే ఇంటి సభ్యులు గుడ్ల కోసం పోటీపడ్డారు. సేకరించిన గుడ్లను ఓ బుట్టలో పెట్టి.. మరికొన్ని గుడ్ల కోసం సన్నీ ప్రయత్నిస్తుండగా.. ఆయన దాచుకున్న వాటిని ప్రియ దొంగిలించింది. ‘‘నాకు బుట్ట దొరికింది’’ అంటూ ప్రియ.. సన్నీ దాచుకున్న కోడిగుడ్లు దొంగిలిస్తుండగా.. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన సన్నీ ఆమెను ఆపే ప్రయత్నం చేశాడు. ‘ప్లీజ్‌ నా గుడ్లను కాపాడుకుంటున్నా’ అని బల్ల మీద పడగా, సన్నీ వేలికి చిన్నగాయమైంది. అక్కడే ఉన్న ప్రియ కూడా పట్టుకోల్పోయి కింద పడబోయింది. అయితే సన్నీ కావాలని తనని తోశాడనుకుని ఆగ్రహానికి గురైన ప్రియా.. పూలకుండీ ఎత్తి ‘ఫిజికల్‌ అయితే, చెంప పగిలిపోతుంది’ అని వార్నింగ్ ఇచ్చింది. దీనికి సన్నీ కూడా సీరియస్‌గానే రియాక్ట్ అయ్యాడు.

‘‘నోరు పారేసుకోకు. కష్టపడి సొంతం చేసుకున్న వాటిని ఇలా చేస్తే ఊరుకోవాలా?’’ అని సన్నీ.. ప్రియతో గొడవకు దిగాడు. దీనికి ప్రియ బదులిస్తూ...  ‘‘నా ఇష్టం. నా గేమ్‌ ఇదే. మీరు అర్ధరాత్రుళ్లు దొంగతనం చేస్తే.. దొంగతనం కాదు. కష్టపడి ఆడినట్లు’’ అంటూ కౌంటరిచ్చింది. ఆ మాటలతో ఇంకా రెచ్చిపోయిన సన్నీ.. ‘‘ఆట ఆడటం కూడా చేతకాదు. చేతకాని వారు వస్తారు ఇక్కడికి’’ అని కామెంట్ చేశాడు.. ‘‘ఏయ్‌.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెంప పగిలిపోతుంది’ అని ప్రియ ఎదురుదాడికి దిగింది. దీంతో సన్నీ.. ‘‘ఇంకోసారి చెంప పగిలిపోతుందంటే బాగోదు. దమ్ముంటే కొట్టు’’ అంటూ ప్రియను ఇంకా రెచ్చగొట్టాడు. సన్నీని మానస్‌, ప్రియను ప్రియాంక ఆపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కాజల్‌ మధ్యలో కలగజేసుకొని మా బుట్టలనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని అడగ్గా.. మిమ్మల్నే టార్గెట్‌ చేస్తానని ప్రియ కుండబద్ధలు కొట్టింది. దీంతో కాజల్‌ వెటకారంగా నవ్వగా.. ప్రియ కూడా అలానే నవ్వేసింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: చెంప పగిలిపోద్దంటూ సన్నీకి ప్రియా వార్నింగ్, సిరితో రవి సీక్రెట్ డీల్

హౌస్‌లో ఈస్థాయిలో మాటల యుద్ధాలు జరుగుతుండగా.. శ్రీరామ్‌ - ప్రియాంకల మధ్య ప్రేమ కబుర్లు చోటుచేసుకున్నాయి. ‘‘ఇక, నేను ఈ గేమ్స్‌ ఆడలేను, నీతో సెటిల్‌ అయిపోతాను’’ అని ప్రియాంక.. శ్రీరామ్‌ చేతుల్ని పట్టుకుని బతిమలాడింది. అనంతరం, శ్రీరామ్‌-ప్రియాంకల మధ్య సిరి గురించి సరదా సంభాషణ కొనసాగింది. ‘‘సిరిది ఉప్మా మొహం. మాడిపోయిన చపాతీ’ అంటూ ప్రియాంక కామెంట్‌ చేసింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: చెంప పగిలిపోద్దంటూ సన్నీకి ప్రియా వార్నింగ్, సిరితో రవి సీక్రెట్ డీల్

ఇదిలా ఉండగా సిరితో సీక్రెట్ డీల్ కుదుర్చుకుంటాడు రవి. హౌస్‌లో ఎగ్స్ ఎక్కడ దాచిపెట్టారో రవి.. సిరికి చెబుతాడు. ఆ గుడ్లని సిరి దొంగిలించి.. కొన్నింటిని రవికి ఇస్తుంది. ఈ గేమ్ మొత్తాన్ని లోబో సీక్రెట్ రూమ్ నుంచి గమనిస్తూ ఉంటాడు. చివరగా బిగ్ బాస్ మరో టాస్క్ ఇస్తారు. ఇది బాతు టాస్క్ . ఈ టాస్క్ లో శ్రీరామ్, యానీ మాస్టర్‌లు పోటీపడ్డారు. ఇద్దరికీ బాతు బొమ్మలని ప్లేట్ పై పెట్టి ఇస్తారు. ఇద్దరూ రింగ్ లోకి ఎంటర్ అయ్యాక ఎవరి బాతు బొమ్మని వారు కింద పడిపోకుండా సేవ్ చేసుకోవాలి. ప్రత్యర్థి బాతు బొమ్మని కింద పడేయడానికి ట్రై చేయవచ్చు. అలా బాతుని ఎవరు ఎక్కువ సేపు డిఫెండ్ చేసుకోగలుగుతారో వారే విజేత. ఈ టాస్క్‌లో యానీ మాస్టర్ విజయం సాధిస్తుంది. దీంతో యానీ మాస్టర్‌కు ఐదు గుడ్లు లభించాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz