close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: టికెట్ టూ ఫినాలే‌లో గెలుపు.. ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీరామ్

Saturday, December 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: టికెట్ టూ ఫినాలే‌లో గెలుపు.. ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీరామ్

తుది అంకానికి చేరే కొద్ది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఉత్కంఠ రేపాల్సింది పోయి.. బోర్ కొట్టిస్తోంది. ఏవో ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం, హగ్గులు తప్పించి ఊపు తగ్గింది. రవి ఎలిమినేషన్ తర్వాతి నుంచి ఆడియన్స్‌ అంతగా ఉత్సాహం చూపించడం లేదని టాక్. మరోవైపు వరుస గాయాల కారణంగా షోలో ఫైర్ తగ్గింది. ఇక రెండు మూడు రోజులు సాగిన ‘‘ టికెట్ టు ఫినాలే గేమ్‌’’ లో అంచనాలను తలకిందులు చేస్తూ అంతిమంగా శ్రీరామచంద్ర విన్నర్‌గా గెలిచి..బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్‌కి తొలి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. గట్టిపోటి ఇచ్చి గెలుస్తారనుకున్న సన్నీ, సిరిలు ఓడిపోవడంతో వారి ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ ఎలా జరిగిందో చూస్తే..

బిగ్‌బాస్ 5 తెలుగు: టికెట్ టూ ఫినాలే‌లో గెలుపు.. ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీరామ్

వీకెండ్ కావడంతో ఉదయాన్నే ప్రియాంక, షణ్ముఖ్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నారు. తను, కాజల్‌లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనిపిస్తోందంటూ పింకీ భయపడింది. ఆ తరువాత షణ్ముఖ్ స్పందిస్తూ.. సన్నీ ఎన్ని తప్పులు చేస్తున్నా యాక్సెప్ట్ చేస్తున్నారని.. చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారని.. వాళ్లు ఎన్ని చేసినా ఏం అనరు.. ఓట్లు వేస్తున్నారని కామెంట్ చేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: టికెట్ టూ ఫినాలే‌లో గెలుపు.. ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీరామ్

ఇక ఇంటిసభ్యులు 'టికెట్‌ టు ఫినాలే' టాస్క్‌లో భాగంగా ‘‘ఫోకస్‌’’ ఛాలెంజ్‌ ఎంచుకున్నారు. ఇందులో భాగంగా కొన్ని శబ్ధాలు ప్లే చేయగా వాటిని సరిగ్గా గుర్తించి వరుస క్రమంలో రాసినవాళ్లు మొదటి స్థానంలో నిలుస్తారని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. సన్నీ, మానస్, శ్రీరామ్, సిరి ఈ గేమ్ ఆడారు. అయితే కాజల్‌ మధ్యలో మధ్యలో మాట్లాడుతూ డిస్టర్బ్‌ చేస్తోందంటూ సన్నీ ఆమెపై ఫైర్‌ అయ్యాడు. ఆమె వెళ్లనని వాదించింది. ఆ తరువాత కాజల్‌పై కేకలు వేశాడు సన్నీ. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక ఈ ఫోకస్ ఛాలెంజ్‌లో సన్నీ, మానస్ ఫస్ట్ ప్లేస్‌లో రాగా.. శ్రీరామ్, సిరి రెండు మూడు స్థానాల్లో నిలిచారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: టికెట్ టూ ఫినాలే‌లో గెలుపు.. ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీరామ్

ఈ గొడవ ముగిసిన తర్వాత అందరూ భోజనం చేస్తుండగా మరోసారి కాజల్‌తో గొడవ పెట్టుకున్నాడు సన్నీ. ఆమెది చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత మానస్-సన్నీ కిచెన్ ఏరియాలో మాట్లుకుంటూ వుండగా. కాజల్.. సన్నీతో మాట్లాడింది. ఎన్ని సార్లు సారీ చెప్పినా పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యింది. దీనికి సన్నీ కౌంటర్ వేయడంతో.. కాజల్‌కి కోపమొచ్చి టిష్యూని విసిరికొట్టింది. దీంతో సన్నీకి కోపమొచ్చింది. అవతలివాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: టికెట్ టూ ఫినాలే‌లో గెలుపు.. ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీరామ్

టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా పోటీదారులందరూ కలిసి 'యాక్యురెసీ' ఛాలెంజ్ ను ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా పోటీదారులకు సంబంధించిన బోర్డ్స్ పై కొన్ని బల్బ్స్ ఉన్నాయి. ప్రతి బల్బ్ కింద ఆ బల్బ్ కి సంబంధించిన స్విచ్ ఉంది. బోర్డ్స్ పై ఉన్న బల్బ్స్ లో కొన్ని ఆన్, కొన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. ప్రతీ పోటీదారుడూ వీలైనంత తక్కువ సమయంలో వారి బోర్డ్స్ పై ఉన్న బల్బ్స్ అన్నింటినీ ఆన్ చేయాల్సి ఉంటుంది. గాయపడిన సిరి-శ్రీరామ్ ఇద్దరి కోసం షణ్ముఖ్ గేమ్ ఆడాడు. ఈ టాస్క్‌లో శ్రీరామ్‌ అతితక్కువ టైమ్‌లో లైట్స్ సెట్‌ చేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. సన్నీ, సిరి, మానస్‌ వరుసగా నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. ఈ ఛాలెంజ్‌లన్నీ ముగిసే సమయానికి చివరి రెండు స్థానాల్లో ఉన్న సిరి, సన్నీ రేసు నుంచి తప్పుకోవాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో మానస్‌, శ్రీరామ్‌ ఫినాలే టికెట్‌ కోసం పోటీపడ్డారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: టికెట్ టూ ఫినాలే‌లో గెలుపు.. ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీరామ్

గార్డెన్ ఏరియాలో పిల్లర్ ఫ్రేమ్స్ ఉంటాయి.. ఒక్కో లెవెల్‌లో ఒక్కో ఫ్రేమ్ ఉంది. పోటీదారులిద్దరూ.. రోప్స్‌కి ఉన్న వెయిట్ బ్యాగ్ సహాయంతో రోప్‌ని లాగి వదిలేస్తూ.. వారి ఫ్రేమ్స్‌లోని ఒక్కో లెవెల్‌లో ఉన్న బోర్డ్స్ అన్నింటినీ ఒకటి తరువాత ఒకటి పగలగొట్టి.. వెయిట్ బ్యాగ్ అన్ని బోర్డ్స్ ని దాటి చివరి ఫ్రేమ్ కి వెళ్లేలా చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌ను ఎవరు వేగంగా కంప్లీట్ చేస్తారో వాళ్లే మొదటి ఫైనలిస్ట్‌గా ఎంపికవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. గేమ్‌లో మానస్ వెయిట్ బ్యాగ్ పిల్లర్ కి ఇరుక్కుపోవడంతో అతడి కంటే ముందుగా శ్రీరామచంద్ర టాస్క్‌ని పూర్తి చేసి మొదటి ఫైనలిస్ట్ గా ఎంపికయ్యాడు. షణ్ను, సన్నీ ఇద్దరూ తన గెలుపుకు సాయం చేశారని వారికి అభినందనలు తెలిపాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.