close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కు సన్నీ ఘాటు ముద్దు... రవి ఆశలు గల్లంతు, ప్రియాంకకు విశ్వ వార్నింగ్

Saturday, October 23, 2021 • తెలుగు Comments

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కు సన్నీ ఘాటు ముద్దు... రవి ఆశలు గల్లంతు, ప్రియాంకకు విశ్వ వార్నింగ్

కెప్టెన్సీ టాస్క్ వల్ల గత కొన్ని రోజులుగా ఇంటి సభ్యుల మధ్య ఏర్పడిన గ్యాప్‌ని తొలగించేందుకు బిగ్‌బాస్ యత్నించారు. కంటెస్టెంట్స్ అంతా జీవితంలో ఎదుర్కొన్న అడ్డంకుల గురించి చెప్పాలని ఆదేశించారు. తాను సూసైడ్ చేసుకోవాలని అనుకున్నట్లు షణ్ముఖ్ కంటతడి పెట్టిస్తే.. జెస్సీ చెప్పిన మాటలు ఇన్స్‌పిరేషన్‌గా వున్నాయి. ఇక హోరాహోరీగా సాగిన కెప్టెన్సీ టాస్క్‌లో సన్నీ గెలిచాడు. ఈ ప్రక్రియలో విశ్వ- ప్రియాంకల మధ్య యుద్ధం నడిచింది. మరి ఉద్వేగంగా సాగిన ఈ రోజు ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కు సన్నీ ఘాటు ముద్దు... రవి ఆశలు గల్లంతు, ప్రియాంకకు విశ్వ వార్నింగ్

ఈరోజు ఎపిసోడ్‌లో 'కోల్గెట్ స్మైల్ చేయండి.. స్టార్ట్ చేయండి..' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. హౌస్ మేట్స్ ను తమ జీవితంలోని మరపురాని అనుభావాలను పంచుకోమని బిగ్ బాస్ చెప్పడంతో.. ఇంటి సభ్యులంతా తమ కష్టాలు, కన్నీళ్లు తోటి కంటెస్టెంట్స్‌తో షేర్ చేసుకున్నారు. ముందుగా సిరి తన అనుభవాలను పంచుకుంటూ.. 'అందరూ అన్నారు ఊళ్లో.. తల్లి ఏమైనా పద్దతిగా ఉందా కూతురు ఉండడానికి అని హేళనగా మాట్లాడేవారని చెప్పింది. మా ఊళ్లో వాళ్లకి, మా చుట్టాలకి నేను చెబుతున్నదేంటంటే తాను పద్దతిగానే పెరిగాను, పద్దతిగానే ఉంటున్నాను' అంటూ కంటతడి పెట్టింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కు సన్నీ ఘాటు ముద్దు... రవి ఆశలు గల్లంతు, ప్రియాంకకు విశ్వ వార్నింగ్

జెస్సీ మాట్లాడుతూ తనకు చిన్నప్పట్నించి గొంతు సమస్య ఉందని, దీని వల్ల తనకు వాయిస్ సరిగా రాదని చెప్పాడ. అయినా గిన్నిస్ బుక్ ఎక్కానని, ఫ్యాషన్ ఐకాన్ గా ఎదిగానని, తన తల్లి మాత్రం తన కొడుకు మోడల్ అని చెప్పుకోదని జెస్సీ చెప్పాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చే అవకాశం వచ్చినప్పుడు మాత్రం గర్వంగా చెప్పుకుందని ఎమోషనల్ అయ్యాడు. ఇక సన్నీ మాట్లాడుతూ.. తన తల్లి గురించి చెబుతూ ముగ్గురు అబ్బాయిలను ఒంటరిగా ఒక మహిళ పెంచడం ఎంత కష్టమో తనకు తెలుసునని కంటతడి పెట్టాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కు సన్నీ ఘాటు ముద్దు... రవి ఆశలు గల్లంతు, ప్రియాంకకు విశ్వ వార్నింగ్

తర్వాత షణ్ముఖ్‌ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ తర్వాత బెంగళూరులో సీటు వచ్చిందని.. ఆ సమయంలో ప్రేమలో విఫలం కావడంతో నా సగం జీవితం పోయిందని చాలా డిజప్పాయింట్ అయ్యానని చెప్పాడు. అదే సమయంలో జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాని.. అయితే నా బెస్ట్‌ ఫ్రెండ్‌ వచ్చి డోర్‌ కొట్టాడని, కానీ తాను తీయలేదుని షన్నూ తెలిపాడు. తర్వాత నేరుగా లోపలికి వచ్చి నాలుగు పీకాడని... ఈ రోజు బతికున్నానంటే వాడివల్లేనని షన్ను గుర్తుచేసుకున్నాడు. వైవా అనే షార్ట్‌ ఫిలిం ద్వారా నాకు బ్రేక్‌ వచ్చిందని.. తన ముఖంలో మళ్లీ నవ్వు తెప్పించిన అమ్మానాన్న, కజిన్స్‌కు రుణపడి ఉంటా' అని షణ్ముఖ్ పేర్కొన్నాడు. ఇక ఈ టాస్క్‌లో స్పూర్తి నింపేలా మాట్లాడిన జెస్సీ విజేతగా నిలిచాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కు సన్నీ ఘాటు ముద్దు... రవి ఆశలు గల్లంతు, ప్రియాంకకు విశ్వ వార్నింగ్

కోడిగుడ్ల టాస్క్ సందర్భంగా జరిగిన గొడవతో సన్నీ, ప్రియా బద్ధ శత్రువులుగా మారిన సంగతి తెలిసిందే. ఇతర హౌస్‌మేట్స్‌తో ప్రియా.. సన్నీ గురించి ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఈసారి సన్నీ కనిపిస్తే కన్నుకొట్టి.. ఫ్లైయింగ్ కిస్ ఇస్తా అంటూ సెటైర్లు వేస్తూ వుంటుందని చెబుతుంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రకటిస్తారు. రవి, మానస్, కాజల్, విశ్వ , సన్నీ కెప్టెన్సీ టాస్క్ లో పోటీ దారులుగా ఉంటారు. టాస్క్ ప్రకారం పోటీ దారులంతా బెలూన్స్ నడుముకి కట్టుకోవాలి. బజార్ మోగిన ప్రతిసారి గార్డెన్ ఏరియాలో ఒక గుండు సూది ఉంచుతారు. ఆ సూదిని దక్కించుకున్నవారు తమకు ఇష్టమైన కెప్టెన్సీ పోటీ దారునికి ఇవ్వవచ్చు.

సూది అందుకున్న కెప్టెన్సీ పోటీ దారుడు.. ఇతర పోటీ దారులలో ఎవరిదైనా బెలూన్‌ని పగలగొట్టవచ్చు. బెలూన్ పగిలిన వారు కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకోవాలి. చివరకు ఎవరి బెలూన్ పగల కుండా ఉంటుందో వారే కెప్టెన్. మొదట జెస్సి సూది అందుకుంటాడు. ఆ తర్వాత ఆ సూదిని కాజల్‌కి ఇస్తాడు. కాజల్.. విశ్వ బెలూన్ పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. రెండు సార్లు కెప్టెన్ అయ్యావు.. మిగిలిన వారికి కూడా ఛాన్స్ కావాలి కదా అని కాజల్ అంటుంది. దీంతో విశ్వ ఆగ్రహానికి గురవుతాడు. కాజల్ నుంచి తప్పించుకునే క్రమంలో విశ్వ బెలూన్ పగిలిపోతుంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కు సన్నీ ఘాటు ముద్దు... రవి ఆశలు గల్లంతు, ప్రియాంకకు విశ్వ వార్నింగ్

రెండోసారి బజర్ మోగిన వెంటనే పెడెస్టెల్ పై ఉన్న గుండుసూది కోసం పరుగెత్తుకుంటూ వెళ్లారు హౌస్‌మేట్స్. ప్రియాంక, విశ్వ, లోబో ముందుగా వెళ్లగా.. ప్రియాంకను తోసుకుంటూ విశ్వ వెళ్లడంతో ఆమె కింద పడిపోయింది. కనీసం పైకి లేపే ప్రయత్నం చేయకపోవడంతో నొచ్చుకున్న పింకీ విశ్వపై మండిపడింది. 'ప్రతిదానికి నీకు కండబలం ఉంది.. అందరికీ లేదు' అని కామెంట్ చేసింది.. 'కండబలం అని ఎందుకు అంటున్నావ్' అంటూ ప్రియాంక మీద విశ్వ కేకలు వేయగా.. ఆమె కూడా ధీటుగా బదులిచ్చింది. మగాడివి కాబట్టి బలం ఎక్కువగా ఉంటుందని అరుస్తుండగా.. 'మగాడు.. గిగాడని మాట్లాడొద్దు.. ఇక్కడ అందరూ కంటెస్టెంట్సే' అని చెప్పాడు విశ్వ. ఆ తరువాత రవి.. మానస్ బెలూన్‌ను పొడిచేశాడు. అనంతరం నేను కెప్టెన్ అవుతానంటూ కాజల్ చెప్పగా.. 'సంపాదించుకో.. అడుక్కోకు' అని డైలాగ్ కొట్టాడు రవి.

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కు సన్నీ ఘాటు ముద్దు... రవి ఆశలు గల్లంతు, ప్రియాంకకు విశ్వ వార్నింగ్

మూడోసారి బజర్ మోగినప్పుడు లోబో గుండుసూది తీసుకొని రవికి ఇచ్చాడు.. ఆ పిన్‌ని చూపిస్తూ కాజల్‌తో మాట్లాడాడు రవి. 'ఈ పిన్ నీ చేతుల్లోకి వస్తే సన్నీ బెలూన్ పొడుస్తావా..? నా బెలూన్ పొడుస్తావా..?' అని క్వశ్చన్ చేశాడు రవి. దానికి సన్నీను పొడుస్తా.. అని చెప్పింది. అయినప్పటికీ కాజల్ బెలూన్‌ను పొడిచేశాడు రవి. చివరి బజర్‌ మోగగానే యానీ మాస్టర్‌ సూది దక్కించుకుని సన్నీకి ఇచ్చింది. సన్నీ, మరో సెకండ్ థాట్ లేకుండా రవి బెలూన్‌ పగలకొట్టాడు. దాంతో సన్నీ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా విజయం సాధించాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కు సన్నీ ఘాటు ముద్దు... రవి ఆశలు గల్లంతు, ప్రియాంకకు విశ్వ వార్నింగ్

తన కోసం సూది తీసుకువచ్చిన యానీ మాస్టర్‌పై సన్నీకి ఇష్టం పెరిగిపోతుంది. కెప్టెన్ అయ్యాక సంతోషంతో సన్నీ యానీ మాస్టర్‌కి గట్టి ముద్దు ఇస్తాడు. అసలు మీకు నేను ఇంగ్లీష్ ముద్దు (లిప్ కిస్) ఇవ్వాలనుకున్నా... ఇక్కడ సెన్సార్ ఒప్పుకోదని ఆగిపోయా అంటాడు. దీంతో యానీ మాస్టర్ కూడా సన్నీ వైపు చిలిపి కోపంతో చూస్తుంది. తాను కెప్టెన్‌ అయితే వేసుకుందామని ఇంటి నుంచి తెచ్చుకున్న స్పెషల్‌ డ్రెస్‌ని ధరించి.. కెప్టెన్ ‌గా బాధ్యతలు స్వీకరించాడు. ‘సన్నీ మహారాజ్‌కి జై’ అంటూ శ్రీరామ్‌ నినాదాలు చేయడం ఫన్నీగా అనిపించింది. అనంతరం సన్నీ హౌస్‌మేట్స్‌ దగ్గరికి వెళ్లి ఎవరికి ఏ పని చేయడం ఇష్టమో కనుక్కొని వాళ్లకు నచ్చినట్లు వుండమని చెప్పాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz