close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌పై కోపం.. హౌస్‌లో గొడవలన్నింటికీ ఆమె కారణం, కాజల్‌పై అరిచేసిన పింకీ

Wednesday, December 1, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌పై కోపం.. హౌస్‌లో గొడవలన్నింటికీ ఆమె కారణం, కాజల్‌పై అరిచేసిన పింకీ

బిగ్‌బాస్ 5 తెలుగులో మరోసారి నామినేషన్ల వల్ల రచ్చ లేచింది. సోమవారం నాటి నామినేషన్స్ సందర్భంగా ఇంటి సభ్యులు డిస్కషన్ చేసుకున్నారు. ప్రియాంక.. కాజల్‌ను నామినేట్‌ చేయడంపై మానస్‌ ఆశ్చర్యపోయాడు. ఇదే సమయంలో తమ మధ్య గొడవలకు కాజలే కారణమంటూ పింకీ మండిపడింది. ఆమె ఎక్కడుంటే అక్కడ గొడవలుంటాయంటూ.. నానా మాటలు అంది. అసలు ఇంత వివాదానికి కారణమేంటీ..? ఈరోజు హౌస్‌లో జరిగిన పరిణామాలేంటీ..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌పై కోపం.. హౌస్‌లో గొడవలన్నింటికీ ఆమె కారణం, కాజల్‌పై అరిచేసిన పింకీ

ఎపిసోడ్ ప్రారంభమైన వెంటనే నిన్న జరిగిన నామినేషన్ ప్రాసెస్‌లో ప్రియాంక.. కాజల్‌ని నామినేట్ చేయడంపై అసహనం వ్యక్తం చేసిన మానస్.. ప్రియాంకతో మాట్లాడానికి ప్రయత్నించాడు. సన్నీ, కాజల్‌లు నీకు సపోర్ట్ చేస్తే ఆమెని నామినేట్ చేశావ్. నువ్ కాజల్‌ని ఫ్రెండ్ గా అనుకోలేదు కాబట్టి ఆమెని నామినేట్ చేశావ్. ముందు నీ స్నేహితులు ఎవరో తెలుసుకో అంటూ పింకీకి క్లాస్ తీసుకున్నాడు మానస్. ఏం చేయాలో, ఎలా ఉండాలో ఆలోచించుకో వెళ్లిపోతుండగా.. నేను నీతో మాట్లాడాలి కూర్చో అని పింకీ చెప్పింది. కానీ ఆమె మాటలు వినకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు మానస్. వినకుండా అలా వెళ్లిపోతావేంటి? అంటూ మండిపడింది. నేను చెప్పాల్సింది చెప్పాను, వెళ్లిపోతున్నా అన్నాడు మానస్‌. నువ్వు చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతావని, నేను వినను అంటూ కుండబద్ధలు కొట్టాడు. నీది నువ్ కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి.. నన్ను తప్పు ప్రూవ్ చేస్తున్నావ్. నాతో ఇక మాట్లాడకు అని గట్టిగా చెప్పాడు మానస్. దీంతో ప్రియాంక వెక్కి వెక్కి ఏడ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రియాంక తనకు నచ్చినట్లు జనాలుమాట్లాడాలని కోరుకుంటుందని.. ఎంత ఫ్రెండ్లీగా ఉందామన్న నా వల్ల అవ్వట్లేదని మానస్.. కాజల్ దగ్గర చెప్పాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌పై కోపం.. హౌస్‌లో గొడవలన్నింటికీ ఆమె కారణం, కాజల్‌పై అరిచేసిన పింకీ

దీంతో సన్నీ, కాజల్‌‌లు మానస్‌ని ఆపపే ప్రయత్నం చేశారు. అటు షణ్ముఖ్‌ దీనిని అదనుగా తీసుకుని పింకీని కెలికే ప్రయత్నం చేశాడు. కాజల్‌ నీ కోసం ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. తర్వాత కిచెన్‌లోనూ మరోసారి మానస్‌,పింకీల మధ్య వాగ్వాదం నడిచింది. నువ్వు ఇంకేదో నా నుంచి కోరుకుంటున్నావని మాట జారాడు. దీనికి హర్ట్ అయిన పింకీ నేను స్నేహాన్నే కోరుకుంటానని.. నువ్వు నా ఫ్రెండ్‌ అని, నువ్వు అంటే నేను చాలా బాధపడతానని బాత్‌ రూమ్‌లో మరోసారి వెక్కివెక్కి ఏడ్చింది. అలా మానస్ ఆమెకు ఎంత దూరంగా వుండాలని ప్రయత్నించినా.. పింకీ మాత్రం అతని వెంటే పడింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌పై కోపం.. హౌస్‌లో గొడవలన్నింటికీ ఆమె కారణం, కాజల్‌పై అరిచేసిన పింకీ

మరోసారి మానస్-కాజల్ మాట్లాడుకుంటూ వుండగా.. ప్రియాంక అక్కడకి వెళ్లి మానస్‌తో పర్సనల్‌గా మాట్లాడాలని, పక్కకు వెళ్లమని కాజల్‌ని అడిగింది. దీనికి మానస్ .. కాజల్‌ను అక్కడే వుండాల్సిందిగా సైగ చేశాడు. దీంతో అతని మాట కాదనలేక కాజల్ అక్కడే కూర్చుంది. ఆ తరువాత లేచి వెళ్తూ.. 'నువ్ అడిగావని నేను వెళ్తున్నా.. ఇలాంటి విషయాలు నేర్చుకో' అని డైలాగ్ కొట్టింది కాజల్. ఆ మాటలకు పింకీ ఫైర్ అయింది. ఇదంతా నాకెందుకు చెబుతున్నామని మండిపడింది. ఈ గొడవలో మానస్ కాజల్‌కే మద్ధతు పలకడంతో.. పింకీ తట్టుకోలేకపోయింది. అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతూ 'జస్ట్ షటప్' అంటూ కాజల్‌ను తిట్టింది. అందరు చెబుతుంటే ఏదో అనుకున్నా.. ఆమె ఎక్కడుంటే అక్కడ గొడవలుంటాయనేది నిజమని, అంతా చేసి సైలెంట్‌గా కూర్చుంటుందని కామెంట్ చేసింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌పై కోపం.. హౌస్‌లో గొడవలన్నింటికీ ఆమె కారణం, కాజల్‌పై అరిచేసిన పింకీ

మానస్ తీరుతో అలిగిన ప్రియాంక భోజనం చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న మానస్.. ఆమెను తినమని బతిమాలాడు. దీంతో ఎమోషనల్ అయిన పింకీ అతడిని హగ్‌ చేసుకుని ఏడ్చింది. వారిద్దరి వివాదం సద్దుమణిగిన తర్వాత తెల్లవారుజామున కాజల్‌కి వెళ్లి సారీ చెప్పింది ప్రియాంక. నేను కావాలని అనలేదని...మానస్ మీద కోపం నీ మీద చూపించేశానని ఆమెని హగ్ చేసుకుంది. మరోవైపు రవి ఎలిమినేషన్ విషయంపై మాట్లాడుకున్నారు షన్నూ- సిరి. కాజల్‌కు ఎలా ఓట్లేస్తున్నారోనంటూ డిస్కష్ చేసుకున్నారు. ఇంతలో షణ్ముఖ్.. కెప్టెన్సీ టైం ముగిసినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్‌.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌పై కోపం.. హౌస్‌లో గొడవలన్నింటికీ ఆమె కారణం, కాజల్‌పై అరిచేసిన పింకీ

అనంతరం బిగ్‌బాస్‌... ఫైనల్‌లో చోటు సంపాదించేందుకు మొదటి ఫైనలిస్ట్ టాస్క్ ఇచ్చాడు. మూడు ఛాలెంజ్‌లలో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ తెచ్చుకుంటారో వారికి ‘‘టికెట్ టు ఫినాలే’’ దక్కుతుందని చెప్పాడు. ఇందులో భాగంగా ఎండ్యూరెన్స్ ఛాలెంజ్ ఇచ్చాడు. దీని ప్రకారం కంటెస్టెంట్లు వీలైనంత ఎక్కువ సేపు ఐస్‌ టబ్‌లో ఉండాలి. ఒక్క కాలు బయటపెట్టినా సరే అప్పుడు మిగిలిన సభ్యులు వారి టబ్‌లోని బాల్స్‌ తీసుకోవచ్చని తెలిపాడు. ఈ టాస్క్ జరుగుతుండగానే ఎపిసోడ్ ముగిసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.