close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియ, హమీదల మధ్య బాడీ షేమింగ్ రచ్చ... 'హగ్' కామెంట్స్‌పై లహరికి ప్రియ క్షమాపణలు

Wednesday, September 22, 2021 • తెలుగు Comments

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియ, హమీదల మధ్య బాడీ షేమింగ్ రచ్చ...  హగ్ కామెంట్స్‌పై లహరికి ప్రియ క్షమాపణలు

బిగ్‌బాస్ హౌస్‌లో ఈరోజు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడంతో హౌస్ హీటెక్కిపోయింది. ప్రతి ఒక్కరు విషయాన్ని పర్సనల్‌గా తీసుకోవడం, ఎఫైర్ విషయాల జోలికి వెళ్లడంతో ఇంటిలో కొత్త రచ్చ షురూ అయ్యింది. ముఖ్యంగా ప్రియా వ్యాఖ్యలు హౌస్‌లో వివాదానికి దారి తీశాయి. సోమవారం ఎపిసోడ్‌లో లహరి, యాంకర్ రవిలు లేట్‌నైట్ హగ్ చేసుకున్నారని చెప్పడంతో ఇద్దరూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.

జెస్సీ - మానస్, నటరాజ్ మాస్టర్ లను నామినేట్ చేశాడు. అయితే నటరాజ్ మాస్టర్.. జెస్సీపై అంతేత్తున లేచాడు. 'ఒకరు చెప్తే నువ్ నన్ను నామినేట్ చేశావ్ అని నాకు తెలుసు.. నువ్ చిన్నపిల్లోడివి.. జుజూ' అంటూ రియాక్ట్ అయ్యారు. షణ్ముఖ్ - ప్రియాను నామినేట్ చేస్తూ.. ఆమె బిహేవియర్ నచ్చలేదని చెప్పాడు. ఆ తరువాత లహరిని నామినేట్ చేశాడు. శ్వేతావర్మ - శ్రీరామచంద్ర, లోబోలను నామినేట్ చేసింది. లోబో గతంలో మాదిరి యాక్టివ్ గా ఉండడం లేదని కామెంట్ చేసింది.

హమీద - ప్రియాను నామినేట్ చేస్తూ.. ఆమెకి ఎంతగా దగ్గరవుదామని అనుకున్నా.. ప్రియా మాటలు హర్ట్ చేస్తూనే ఉన్నాయని.. ఆమె బాడీ షేమింగ్ చేస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడినా తేడాగా చూస్తుందని కామెంట్ చేసింది హమీద. దానికి ప్రియా రియాక్ట్ అవుతూ.. 'నువ్ చాలా పెద్ద మాట అన్నావ్ హమీదా.. నేను అలా అనలేదు. ప్రియాంకకి సర్జరీ అయింది కాబట్టి.. తనకి చిన్న గాయమైనా పెద్దగా నొప్పి వస్తుంది.. నువ్ కూడా బాధపడుతుంటే ఏదైనా సర్జరీ అయిందా అని అడిగాను అంతే.. కావాలంటే ప్రియాంకని అడుగు..' అని చెప్పింది. మధ్యలో హమీదా కలగజేసుకుని 'నేనేం చిన్న పిల్లని కాదు.. మీ అంత పెద్ద సెలబ్రిటీని కాకపోవచ్చు కానీ.. నాలో ఏదో ఉంది కనుకనే ఇక్కడ దాకా వచ్చానని చెప్పింది. ఆ తరువాత ప్రియాంకను నామినేట్ చేసి సిల్లీ రీజన్ చెప్పగా.. నామినేషన్స్ లో చెండాలమైన రీజన్స్ ఇస్తున్నారని.. ఇదొక పనికిమాలిన రీజన్ అని హమీద మీద మండిపడింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియ, హమీదల మధ్య బాడీ షేమింగ్ రచ్చ...  హగ్ కామెంట్స్‌పై లహరికి ప్రియ క్షమాపణలు

కాజల్ - ప్రియాంక, ప్రియాలను నామినేట్ చేసింది. విశ్వ - 'ఒక విమెన్ నిన్ను అడుగుతున్నప్పుడు.. నీ రెస్పెక్ట్ ఏది' అంటూ నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేశాడు. ఆ తరువాత నామినేషన్స్ లో ప్రియా బిహేవియర్ బాలేదంటూ ఆమెని నామినేట్ చేశాడు.

ఈ ఘట్టం ముగిసిన తరువాత ప్రియా ఏడుస్తూ ఉండగా.. ప్రియాంక, మానస్ లు వచ్చి ఆమెని ఓదార్చే ప్రయత్నం చేశారు. లహరి 'సింగిల్ మెన్', 'మ్యారీడ్ మెన్' వ్యాఖ్యల గురించి.. రవిని ప్రశ్నించింది. అయితే, తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రవి చెప్పాడు. ఆ తరువాత ప్రియా, లహరి, రవి కూర్చొని ముచ్చట్లు పెట్టారు. 'లహరిని మీ దగ్గర తక్కువ చేసి మాట్లాడానా..?' అని ప్రియాని అడిగాడు రవి. 'సింగిల్ మెన్ ని వదిలేసి.. నాతోనే ఉంటుంది.. నేను చెప్పలేకపోతున్నా' అని అన్నావ్ బ్రో అని ప్రియా చెప్పింది. ఆ తరువాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న రవి, లహరి డిస్కషన్ షురూ చేశారు. 'ఆమె ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లేదని' లహరి అనగా.. తనను బ్యాడ్‌గా ప్రొజెక్ట్ చేయాలని ప్రియా చూస్తోందని రవి అన్నాడు. గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉన్న ప్రియా.. తాను చూసిందే చెప్పానని, ఏదీ కల్పించి చెప్పలేదమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియ, హమీదల మధ్య బాడీ షేమింగ్ రచ్చ...  హగ్ కామెంట్స్‌పై లహరికి ప్రియ క్షమాపణలు

ఇక ఉదయాన్నే 'సరైనోడు..' సాంగ్ కి హౌస్ మేట్స్ అందరూ డాన్స్ చేశారు. హౌస్ మేట్స్ అందరి ముందు లహరికి క్షమాపణలు చెప్పింది ప్రియా. అలానే నిత్య (రవి భార్య)కు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వమని రవి అడిగాడు. మొదట ఒప్పుకోని ప్రియా.. ఆ తరువాత జరిగిన విషయాన్ని నిత్య, లహరి ఫ్యామిలీకు కెమెరా ముందు చెప్పింది.

తర్వాత హౌస్ మేట్స్ అందరికీ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అదే 'హైదరాబాద్ అమ్మాయ్.. అమెరికా అబ్బాయ్'.
ఈ టాస్క్ లో లహరి.. హైదరాబాద్ అమ్మాయిగా, యానీ-నటరాజ్ ఆమె పేరెంట్స్ గా.. జెస్సీ ఆమె టీనేజ్ బ్రదర్ గా.. రవి.. అమ్మాయి మావయ్యగా, ప్రియాంక చిన్ననాటి స్నేహితురాలిగా, మానస్.. అమ్మాయి పొరుగింటి వారుగా నటించాలి.
శ్రీరామ్.. అమెరికా నుంచి తిరిగొచ్చిన అబ్బాయ్ గా, విశ్వ.. అబ్బాయ్ పర్సనల్ అసిస్టెంట్ గా, ప్రియా.. అబ్బాయి తల్లిగా, సిరి.. అబ్బాయి చిన్ననాటి స్నేహితురాలుగా, కాజల్.. అబ్బాయి వాళ్ల అక్కగా, సన్నీ.. అబ్బాయి ఫ్రెండ్ గా, హమీద.. అబ్బాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా, షణ్ముఖ్.. మ్యారేజ్ బ్రోకర్ గా, లోబో.. ఈవెంట్ మేనేజర్, శ్వేతా.. లోబోకి అసిస్టెంట్ గా నటించాలి. ఈ టాస్క్ బిగెన్ అయ్యే సమయానికి టైం అవ్వడంతో ఎపిసోడ్ ముగిసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz