close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌ కోసం శ్రీరామ్ త్యాగం.. కాజల్‌ సెటైర్లు, మళ్లీ సిరి- షన్నూ హగ్గులు

Friday, December 10, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌ కోసం శ్రీరామ్ త్యాగం.. కాజల్‌ సెటైర్లు, మళ్లీ సిరి- షన్నూ హగ్గులు

బిగ్‌బాస్ 5 తెలుగులో రోల్ ప్లే టాస్క్ కంటిన్యూ అవుతోంది. అలాగే టాస్కుల్లో బాగా ఆడిన వారికి ప్రజలను ఓట్లు అడిగే ఛాన్స్ ఇచ్చారు బిగ్‌బాస్. ఇందులో భాగంగా నిన్న షణ్ముఖ్ జస్వంత్ ఓట్ల కోసం రిక్వెస్ట్ చేశారు. అయితే నవ్వకుండా వుండాలంటూ బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో మానస్, శ్రీరామ్ సమానంగా నిలవడంతో టై అయ్యింది. మరి అప్పుడు శ్రీరామ్ ఏం చేశాడు..? శ్రీరామ్‌- కాజల్‌కు జరిగిన గొడవేంటీ..? హౌస్‌మేట్స్‌ని మళ్లీ కలిపిన టాస్క్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌ కోసం శ్రీరామ్ త్యాగం.. కాజల్‌ సెటైర్లు, మళ్లీ సిరి- షన్నూ హగ్గులు

నిన్న నవ్వకుండా వుండాల్సిన టాస్క్‌లో శ్రీరామ్, మానస్‌ సమానంగా నిలవడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో వీరిద్దరిలో విజేత ఎవరో ఇంటి సభ్యులే నిర్ణయించాలి అని బిగ్ బాస్ ఆదేశించారు. అయితే శ్రీరామ్ జోక్యం చేసుకుని ఇష్యూని మేమే డీల్ చేసుకుంటామని చెప్పి.. తను త్యాగం చేసి మానస్‌కి ఛాన్స్ ఇచ్చాడు. దాంతో మానస్‌ మైకు ముందుకు వచ్చి.. తనకు , తన ఫ్రెండ్స్‌ కాజల్‌, సన్నీకి కూడా ఓట్లేసి గెలిపించమని విజ్ఞప్తి చేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌ కోసం శ్రీరామ్ త్యాగం.. కాజల్‌ సెటైర్లు, మళ్లీ సిరి- షన్నూ హగ్గులు

అయితే నీకంటే ముందే తామంతా మానస్‌ని విన్నర్‌గా అనౌన్స్ చేయాలని రెడీ అయ్యామని.. నువ్వేదో త్యాగం చేసినట్లు ఫీల్ అవ్వద్దు అంటూ కాజల్ కామెంట్ చేసింది. దీంతో కాజల్, శ్రీరామ్ మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. గొడవ మధ్యలోనే కాజల్‌ అతడిని బ్రో అనేసింది. దీనికి శ్రీరామ్‌ భగ్గున లేచాడు. నువ్వు నాకు సిస్టర్‌ కాదు, బ్రో అని పిలవొద్దు అని తేల్చి చెప్పేశాడు. హర్ట్ అయిన కాజల్‌ కంటతడి పెట్టుకుంది. ఆ తర్వాత తన బాధను సన్నీ, మానస్‌లకు చెప్పుకుని ఎమోషనల్ అయ్యింది. నిన్ను లైట్‌ తీసుకున్నప్పుడు ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకోవద్దంటూ సన్నీ సూచించాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌ కోసం శ్రీరామ్ త్యాగం.. కాజల్‌ సెటైర్లు, మళ్లీ సిరి- షన్నూ హగ్గులు

ఇక ఓటు అప్పీల్‌ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ మూడో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇంటిసభ్యులందరూ సినీ స్టార్స్‌లా నటించాల్సి ఉంటుంది. అందులో భాగంగా సన్నీ.. బాలయ్య, శ్రీరామ్‌.. చిరంజీవి, కాజల్‌.. శ్రీదేవి, మానస్‌.. పవన్‌ కల్యాణ్‌, షణ్ను.. సూర్య, సిరి.. జెనీలియాగా నటించారు. అంతేకాదు క్లాస్‌, మాస్‌ పాటలకు స్టెప్పులు కూడా వేశారు. గబ్బర్ సింగ్, సింహా, హ్యాపీ, బొమ్మరిల్లు, ముఠామేస్త్రి చిత్రాల్లో పాటలకు ఆడిపాడారు. ఇక బాలయ్య గెటప్‌లో సన్నీ బాగా ఎంటర్‌టైన్ చేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌ కోసం శ్రీరామ్ త్యాగం.. కాజల్‌ సెటైర్లు, మళ్లీ సిరి- షన్నూ హగ్గులు

ఇంతటి ఫన్నీ టైంలో కూడా షణ్ను సిరికి మధ్య మళ్లీ తగవు మొదలైంది. నువ్వు వాళ్లతో (సన్నీ గ్రూప్‌తో) అయితే హ్యాపీగా ఉంటున్నావు.. నాతో నీకు సింక్ కావట్లేదంటూ అరిచేస్తాడు. ఎప్పుడూ లేనిది ఈ వారం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాంటూ సిరి నొచ్చుకుంటుంది. కాసేపటికే తనను తాను సముదాయించుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ షణ్నూని కూల్ చేసి హగ్ ఇచ్చింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.