close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్- పింకీ పెళ్లి, లోబోకి రవి వెన్నుపోటు.. ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే..?

Sunday, October 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్- పింకీ పెళ్లి, లోబోకి రవి వెన్నుపోటు.. ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే..?

వీకెండ్ కావటంతో బిగ్‌బాస్ హౌస్ సందడిగా మారింది. ఇక ఇంటిలోని పెళ్లి కావాల్సిన వారు తమకు కాబోయే వారిలో ఎలాంటి లక్షణాలు వుండాలో చెప్పారు. పింకీని ఈ సందర్భంగా శ్రీరామ్ ఆకాశానికెత్తేశాడు. ప్రియాంక- మానస్‌లకు పెళ్లి చేసి ఇంటిని వివాహ వేదికగా మార్చేశారు. ఇక హోస్ట్ నాగార్జున ఎప్పటిలాగే ఇంటి సభ్యులు చేసిన పనుల్ని బయటకుతీసి ఏకీపారేశారు. ముఖ్యంగా చెంప పగలగొడతాను అని ఎన్నిసార్లు అంటావని ప్రియను నిలదీశాడు నాగ్‌. మరి ఈ రోజు ఎవరికీ నాగ్ క్లాస్ తీసుకున్నాడు..? ఎవరికి కంప్లిమెంట్ ఇచ్చారు.. ఈ వారం వరెస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్- పింకీ పెళ్లి, లోబోకి రవి వెన్నుపోటు.. ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే..?

కెప్టెన్ గా గెలిచిన సన్నీ.. రేషన్ మ్యానేజర్ గా కాజల్ ని ఎంపిక చేసుకున్నారు. అనంతరం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి 'సరైన మ్యాచ్‌ను వెతకండి' అనే టాస్క్ ఇవ్వగా.. సన్నీ, మానస్, షణ్ముఖ్, ప్రియాంక, సిరి, శ్రీరామ్ ఈ టాస్క్ లో పాల్గొన్నారు. వీరంతా కూడా తమకు కాబోయే లైఫ్ పార్టర్‌లో ఉండాల్సిన లక్షణాలను చెప్పారు. మానస్‌ మాట్లాడుతూ.. 'నేను ఎక్కువ అలుగుతాను, అప్పుడు తనే అర్థం చేసుకుని ముందుగా నన్ను బుజ్జగించాలి. రెండు కుటుంబాలను ప్రేమగా చూసుకోవాలి' అని చెప్పాడు. ఆ వెంటనే ప్రియాంక చెబుతూ.. 'అబ్బాయి నాకంటే ఎక్కువ హైట్‌ ఉండాలి. మంచివాడై ఉండి, తనను అర్థం చేసుకోవాలని తన మనసులో మాటను చెప్పింది.

జెస్సీ తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అంతా పింకీ-మానస్‌ను బెస్ట్‌ కపుల్‌గా పేర్కొన్నారు. దీంతో బిగ్‌బాస్‌ వారిద్దరూ పూలదండలు మార్చుకునేలా చేసి పెళ్లి జరిపించేశాడు. అనంతరం వీళ్లిద్దరూ 'గువ్వా గోరికంతో..' పాటకు జంటగా స్టెప్పులేశారు. ఇక అర్ధరాత్రి రవి, యానీ మాస్టర్, ప్రియా ముచ్చట్లు పెట్టుకున్నారు. మానస్ విషయంలో ప్రియాంకకి క్లారిటీ ఉంది కదా అని ప్రియాను అడిగాడు రవి. 'హా పిచ్చ లైట్' అంటూ బదులిచ్చింది ప్రియా. కానీ టాస్క్ లో మొత్తం మానస్‌కే సపోర్ట్ చేస్తుందని యానీ చెప్పింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్- పింకీ పెళ్లి, లోబోకి రవి వెన్నుపోటు.. ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే..?

ఆ తరువాత సిరి స్టిక్కర్స్‌ను దొంగతనం చేసింది నేనే అని ప్రియా, యానీల దగ్గర అంగీకరించాడు రవి. ఆ విషయాన్ని ప్రియా వెంటనే వెళ్లి సిరితో చెప్పేసింది. షణ్ముఖ్-కాజల్ అర్ధరాత్రి కూర్చొని రవి గురించి డిస్కస్ చేసుకున్నారు. తను గేమ్ ఆడకుండా హౌస్ మేట్స్‌తో ఆడుతున్నాడని షణ్ముఖ్ అన్నాడు. శ్రీరామ్.. రవికి లొంగిపోయాడని.. విశ్వ, లోబో కూడా రవి కోసమే ఆడుతున్నారని ఆరోపించాు షణ్ముఖ్. ఉదయాన్నే ప్రియాంకతో మీటింగ్ పెట్టాడు విశ్వ. బెలూన్ల టాస్క్ సందర్భంగా తను కావాలని తోయలేదని.. టాస్క్ లో అలా అయిపోయిందని చెప్పే ప్రయత్నం చేయగా.. ప్రియాంక ఏ మాత్రం పట్టించుకోలేదు.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్- పింకీ పెళ్లి, లోబోకి రవి వెన్నుపోటు.. ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే..?

ఆ వెంటనే కింగ్ నాగార్జున స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రావడంతోనే రవి నుంచే మొదలు పెడతారు. ఈ వారం హౌస్ లో వరస్ట్ పెర్ఫామర్ ఎవరు అని ప్రశ్నించగా రవి.. ప్రియాంక పేరు చెబుతాడు. ఆ తర్వాత రవి స్టిక్కర్స్ దొంగిలించడం గురించి నాగ్ ప్రశ్నించారు. అవి అక్కడ పడిపోయి ఉంటే తీసుకున్నాను.. దొంగిలించలేదు అని రవి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత విశ్వ కూడా వరస్ట్ పెర్ఫామర్‌గా ప్రియాంక పేరే చెబుతాడు. బెలూన్ టాస్క్ సమయంలో గుండు సూది కోసం పింకినీ విశ్వ నెట్టివేయడం‌పై డిస్కషన్ జరుగుతుంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్- పింకీ పెళ్లి, లోబోకి రవి వెన్నుపోటు.. ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే..?

ఈ సందర్భంగా అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు గాను నాగ్ వీడియో ప్లే చేస్తాడు. విశ్వ ఎంత బుకాయించినా తప్పు అతనిదేనని తేలుతుంది. అనంతరం జెస్సి, ప్రియాంక, ప్రియా ముగ్గురూ వరస్ట్ పెర్ఫామర్ గా విశ్వ పేరే చెబుతారు. ఆ తరువాత ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారిన ప్రియా- జెస్సీ ఫైట్‌పై నాగ్ చర్చ పెట్టారు. ప్రతిసారి 'చెంప పగలగొడతాను.. చెంప పగలగొడతాను.. చెంప పగలగొడతాను.. అని ఎన్ని సార్లు అంటావ్ ప్రియా..?' అని ప్రశ్నించారు కింగ్. దానికి ప్రియా బదులిస్తూ.. 'చాలా ఫోర్స్‌గా వచ్చి నెట్టేశాడు సార్.. మళ్లీ గనుక ఫిజికల్ అయితే చెంప పగలగొడతానని చెప్పా' అని బదులిచ్చింది. 'రిఫ్లెక్స్ లో ఒకసారి అనొచ్చు కానీ పక్కనున్న పూల కుండీ తీసి మరి మీదకు వెళ్లబోయావ్' అని నాగ్ ప్రశ్నించగా.. వెంటనే సన్నీ కలగజేసుకుని 'నేను అది చూడలేదు సార్ ' అని చెప్పాడు. దానికి నాగార్జున 'చూసినా నువ్వేం చేస్తావ్ లే.. మహా అయితే జెస్సీ మీదకు వెళ్లగలవ్' అంటూ సెటైర్లు వేశారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్- పింకీ పెళ్లి, లోబోకి రవి వెన్నుపోటు.. ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే..?

ఆ తర్వాత సన్నీ ఇతరుల హెల్ప్ తీసుకుని టాస్క్ ఆడడం వల్ల కెప్టెన్సీ క్యాన్సిల్ అని నాగ్ అన్నాడు. దీంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అవుతారు. తనను తాను రక్షించుకోవడం కోసం మాత్రమే సాయం తీసుకున్నానని సన్నీ వివరణ ఇవ్వడంతో నాగ్ యాక్సెప్ట్ చేస్తారు. దీంతో సన్నీ కెప్టెన్సీ నిలబడుతుంది. ఇక బిగ్‌బాస్ జెస్సీకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ గురించి చర్చ జరుగుతుందని. తనని ఎదవని చేసి వాడుకున్నారు అంటూ సిరి, జెస్సి పై షణ్ముఖ్ అలిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబందించిన ఫన్నీ వీడియోని నాగ్ ప్లే చేశారు. ఈ వీడియోతో షణ్ముఖ్ హౌస్ మేట్స్ ముందు నవ్వులపాలైనట్లు అయింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్- పింకీ పెళ్లి, లోబోకి రవి వెన్నుపోటు.. ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే..?

ఇక యానీ మాస్టర్ వరస్ట్ పెర్ఫార్మర్ గా జెస్సీ పేరు చెప్పింది. సీక్రెట్ టాస్క్ సరిగ్గా ఆడలేకపోయాడని రీజన్ చెప్పింది. శ్రీరామ్ వరస్ట్ పెర్ఫార్మర్ గా మానస్ పేరు చెప్పాడు. అతను ఒక్కడే గేమ్ ఆడలేదని కారణం తెలిపాడు. కాజల్ వరస్ట్ పెర్ఫార్మర్ గా ప్రియా పేరు చెప్పింది. మానస్ వరస్ట్ పెర్ఫార్మర్ గా షణ్ముఖ్ పేరు చెప్పాడు. సన్నీ వరస్ట్ పెర్ఫార్మర్ గా ప్రియా పేరు చెప్పాడు. అయితే దీనికి ప్రియా కోపం తెచ్చుకోకుండా.. సన్నీని ప్రేమగా పిలుస్తూ ఫ్లయింగ్ కిస్‌లు పెట్టింది. ఇకపోతే ఎక్కువ మంది ఓట్లతో ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్‌గా విశ్వ నిలిచాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్- పింకీ పెళ్లి, లోబోకి రవి వెన్నుపోటు.. ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే..?

చివరిగా నామినేషన్స్‌లో ఉన్న లోబో, రవి, జెస్సి, ప్రియా, సిరి, అనీ, శ్రీరామ్, కాజల్ లలో శ్రీరామ్‌కు గోల్డెన్ ఎగ్ రావడంతో శ్రీరామ్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఆ తర్వాత లోబోని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. హౌస్‌లో ఉన్నవారిలో తోపు ఎవరు ? డూపు ఎవరు అని ప్రశ్నించారు. దీనికి లోబో బదులిస్తూ.. ప్రియాంక, కాజల్, ప్రియా, రవి, అని, షణ్ముఖ్‌లు డూపులుగా చెబుతాడు. మిగిలిన మానస్, సన్నీ, విశ్వ, శ్రీరామ్, సిరి, జెస్సీలను తోపులుగా చెబుతాడు. రవిని డూపుగా పరిగణించడంతో నాగ్ సహా అంతా షాక్ అవుతారు. ఎందుకంటే రవి, లోబో ఫ్రెండ్ షిప్ గురించి అందరికి తెలిసిందే. అయితే రవిని డూపుగా ఎందుకు చెప్పానో వివరణ ఇస్తాడు లోబో. రవికి తాను అవసరమైనప్పుడు మాత్రమే గుర్తుకు వస్తానని చెబుతాడు. లోబో మాటలను స్క్రీన్‌లో చూస్తున్న రవి ఒకింత ఆశ్చర్యానికి గురవుతాడు.

ఇక నామినేషన్స్‌లో ఉన్న వారికి ఒక్కొక్కరికి ఒక్కో ఎగ్ ఇస్తారు. ఆ ఎగ్ పగలగొట్టినప్పుడు లోపల రెడ్ కలర్ ఉంటే సేఫ్ కాదు.. గ్రీన్ ఉంటే సేఫ్. దీంతో ఒక్క కాజల్‌కు మాత్రమే గ్రీన్ ఎగ్ వస్తుంది.. ఆమె సేవ్ అవుతుంది. మిగిలిన ప్రియా, జెస్సి, లోబో, అనీ, సిరి, రవి లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరో సేవ్ అవుతారో సండే ఎపిసోడ్‌లో తేలనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.