close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి- సన్నీల మధ్య లింక్.. తట్టుకోలేకపోయిన షన్నూ, టాప్ 6లో ఎవరెవరంటే..?

Tuesday, December 7, 2021 • తెలుగు Comments

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి- సన్నీల మధ్య లింక్.. తట్టుకోలేకపోయిన షన్నూ, టాప్ 6లో ఎవరెవరంటే..?

బిగ్‌బాస్ 5 తెలుగు 14వ వారానికి చేరుకుంది. దీంతో తెలుగు నాట విన్నర్ ఎవరంటూ డిస్కషన్ షురూ అయ్యింది. ఇక టాప్ 6లో ఎవరు వుండాలనే దానిపై ఇంటి సభ్యుల మధ్య గొడవ నడిచింది. ఈ క్రమంలోనే మళ్లీ సిరి- షణ్ముఖ్‌ల మధ్య రచ్చ జరిగింది. ఆపై సన్నీతో సిరికి లింక్ పెడుతూ కాజల్ ఏడిపించింది. మరి హౌస్‌మేట్స్ మధ్య జరిగిన చర్చల్లో ఎవరికి నెంబర్‌వన్ వచ్చింది.. మిగిలివారికి ఏ ప్లేస్ వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి- సన్నీల మధ్య లింక్.. తట్టుకోలేకపోయిన షన్నూ, టాప్ 6లో ఎవరెవరంటే..?

షో ప్రారంభమైన వెంటనే.. కాజల్ టాప్ 5లో వుండాలని అనుకుంటోందని దానికి తగ్గట్లుగా గేమ్ ఆడే ఛాన్స్ ఉందని సిరిని జాగ్రత్తగా ఉండమని సూచించాడు షణ్ముఖ్. మళ్లీ యథాప్రకారం.. ఫ్రెండ్‌షిప్‌ హగ్‌ ఇచ్చుకున్నారు. రాత్రి కాజల్‌ సన్నీకి, సిరి షణ్నుకు దిష్టి తీశారు. అటు ప్రియాంక ఎలిమినేషన్‌తో బాగా డిజప్పాయింట్ అయిన మానస్‌ ఒంటరిగా కూర్చుంటే కాజల్‌, సన్నీ అతడిని ఏడిపించారు. ప్రియాంక వెళ్లేటప్పుడు పాటిన పాటను పాడుతూ టీజింగ్ చేశారు. దీనికి మానస్ స్పందిస్తూ.. మాది ఫ్రెండ్‌షిప్‌రా, లవ్‌ కాదురా అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి- సన్నీల మధ్య లింక్.. తట్టుకోలేకపోయిన షన్నూ, టాప్ 6లో ఎవరెవరంటే..?

అనంతరం మానస్- కాజల్‌లు సన్నీ, సిరికి లింకు పెడుతూ జోకులు పేల్చారు. సిరి కనబడగానే నీ ఆలియాభట్‌ వస్తుందంటూ సన్నీ దగ్గర కామెంట్లు చేశారు. అయితే దీనికి నోచ్చుకున్న షణ్నూ సిరిపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. మీ ఇద్దరి మధ్య ట్రాక్‌ క్రియేట్‌ చేయాలని చూస్తున్నారని, నువ్వు జాగ్రత్తపడకపోతే నీ క్యారెక్టర్‌ బ్యాడ్‌ అవుతుందని సిరికి హెచ్చరించాడు. వాళ్లేదో సరదాగా ఆట పట్టించారులే అని సిరి లైట్‌ తీసుకోవడంతో షణ్నూకి చిర్రెత్తుకొచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి- సన్నీల మధ్య లింక్.. తట్టుకోలేకపోయిన షన్నూ, టాప్ 6లో ఎవరెవరంటే..?

ఉదయాన్ని వీజే సన్నీ నటించిన ‘‘ సకలగుణాభిరామ’’ సినిమాలోని సైకో సైకో పిల్లా సాంగ్‌ ఆటకు అంతా డ్యాన్స్ చేశారు. షణ్ను మాత్రం హౌస్‌లో తన జర్నీ గురించి లోలోపల కుమిలిపోయాడు. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు నువ్వెక్కడా నాకు సాయం చేసినట్లు అనిపించలేదు బిగ్‌బాస్‌ అని కెమెరాల వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ తర్వాత సిరి దగ్గరకెళ్లి మాట్లాడాడు. మని ఇద్దరిని విడదీయాలని ప్లాన్లు చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. దీంతో వీడేంటో, ఎందుకు ఇలా మాట్లాడతాడో అర్థం కాడంటూ ఆవేదన చెందింది. తనలో తాను బాధపడింది సిరి

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి- సన్నీల మధ్య లింక్.. తట్టుకోలేకపోయిన షన్నూ, టాప్ 6లో ఎవరెవరంటే..?

అనంతరం ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్‌లో టాప్‌ 6లో ఎవరెవరు ఏ స్థానానికి అర్హులో, ఎవరు టాప్‌ 5లో ఉండకూడదో నిర్ణయించుకుని ఆయా స్థానాల్లో నిలబడాలని బిగ్‌బాస్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఇంటి సభ్యుల మధ్య చాలా సేపు డిస్కషన్‌ జరిగింది. మొదట ఎవరికి వాళ్లు తాము ఫస్ట్ ప్లేస్‌లో ఉంటామని అనుకున్నారు. ఆ తర్వాత అభిప్రాయాలు పంచుకున్నారు. సుదీర్ఘ చర్చల అనంతరర...ఫైనల్ గా మొదటి స్థానంలో సన్నీ, రెండో స్థానంలో షణ్ముఖ్, మూడో స్థానంలో కాజల్, నాల్గో స్థానంలో శ్రీరామ్, ఐదో స్థానంలో మానస్, ఆరో స్థానంలో సిరి నిలిచింది.

ఇక ఈ వారం నామినేషన్స్ విషయానికి వస్తే.. గతంలో మాదిరి ఇంటి సభ్యుల చేత నామినేషన్స్‌ చేయించకుండా... ఫినాలే వీక్ కి చేరడానికి నేరుగా ప్రేక్షకులను ఎదుర్కోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించారు. దీనిలో భాగంగా ఫైనలిస్ట్ శ్రీరామ్ కాకుండా మిగిలిన హౌస్ మేట్స్ అందరూ నేరుగా నామినేట్ అయినట్లు చెప్పారు . దీంతో షణ్ముఖ్, కాజల్, సిరి, మానస్, సన్నీలు నామినేషన్‌లో వున్నట్లయ్యింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz