close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: బిగ్‌బాస్ ట్విస్ట్.. మానస్ రుణం తీర్చుకున్న యానీ మాస్టర్

Wednesday, November 3, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: బిగ్‌బాస్ ట్విస్ట్.. మానస్ రుణం తీర్చుకున్న యానీ మాస్టర్

బిగ్‌బాస్ 5 తెలుగు 9వ వారంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో హౌస్‌మేట్స్‌కి షాకిచ్చాడు బిగ్‌బాస్. నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో ఒకరిని సేవ్ చేసే సీక్రెట్ పవర్‌ని ఇంట్రడ్యూస్ చేయడంతో హౌస్‌మేట్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. మరి నామినేషన్స్‌లో ఎవరు సేవ్ అయ్యారు.. ఎవరికి స్పెషల్ పవర్ వచ్చింది.. ఆ పవర్‌తో ఏ కంటెస్టెంట్స్ ఎవరిని సేవ్ చేశారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: బిగ్‌బాస్ ట్విస్ట్.. మానస్ రుణం తీర్చుకున్న యానీ మాస్టర్

షో ప్రారంభమైన తర్వాత.. నామినేషన్‌కి సంబంధించి డిస్కషన్‌ నడిచింది. ఈ సందర్భంగా మానస్‌, సన్నీ మధ్య జెస్సీ గురించి ప్రస్తావన వచ్చింది. జెస్సీ వామ్టింగ్ చేసుకున్నప్పుడు అతని ఫ్రెండ్స్ ఎవరూ పట్టించుకోలేదని.. కానీ తాను అలా చూస్తూ ఊరుకోలేను అని చెప్పాడు సన్నీ. తాను హెల్ప్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. దీనికి మానస్‌ స్పందిస్తూ, వాళ్ల మధ్య అండర్‌స్టాండింగ్‌ బాగానే ఉందని.. నువ్వే ఓవర్‌గా ఫీలవుతున్నావని చెప్పాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: బిగ్‌బాస్ ట్విస్ట్.. మానస్ రుణం తీర్చుకున్న యానీ మాస్టర్

అనంతరం యానీ మాస్టర్, రవి, శ్రీరామ్‌లు సన్నీ గురించి చర్చించుకున్నారు. సన్నీ ఏం మాట్లాడుతాడో అర్థం కాదని.. కానీ అతని మనసు మాత్రం క్లీయర్ అని యానీ మాస్టర్ అంటుంది. కాకపోతే ఆవేశంలో ఏదో మాట్లాడేస్తుంటాడని చెబుతుంది. దీనిపై రవి మాట్లాడుతూ.. సన్నీకి నిదానంగా చెబితే అర్థం చేసుకుంటాడని, అయితే చెప్పేది వినడని అన్నాడు. అలాగే మనం మాట్లాడేదాంట్లో ఒక్క పాయింట్‌నే పట్టుకుని వాదిస్తూ.. అరుస్తాడని రవి అన్నాడు. కాజల్‌ గురించి చెబుతూ ఆమె చాలా కన్నింగ్‌ అని అందుకే నాగ్‌ సర్‌ స్నేక్‌ అని చెప్పాడని, మాట్లాడుతూ కాటేస్తుందని రవి కామెంట్ చేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: బిగ్‌బాస్ ట్విస్ట్.. మానస్ రుణం తీర్చుకున్న యానీ మాస్టర్

ప్రియాంక గురించి చెబుతూ.. ఆమె ఎవరినైనా నామినేట్ చేయొచ్చు... కానీ తనని మాత్రం ఎవరు నామినేట్‌ చేసినా తట్టుకోలేదు అని అంటాడు రవి. దీనికి కెప్టెన్‌ షణ్ముఖ్‌ స్పందిస్తూ.. అదే విషయాన్ని నేను నామినేషన్‌లో చెప్పానని గుర్తుచేశాడు. సన్నీ గురించి చెబుతూ, సన్నీ గతంలో హైపర్‌ అయితే శ్వేత, హమీద ఉండి కంట్రోల్‌ చేసేవాళ్లని.. ఇప్పుడు వాళ్లు లేరని దీంతో రెచ్చిపోతున్నాడని షణ్ముఖ్‌ అంటాడు. అయితే సన్నీ ఆవేశంలో ఏం మాట్లాడతాడో తనకే తెలియదని అతనిని కాపాడే ప్రయత్నం చేశాడు షన్నూ.

నామినేషన్లో ఉన్న సభ్యులు మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వ. అంటే కేవలం కెప్టెన్ షణ్ముక్ మినహా మిగిలిన పదిమందీ నామినేషన్లో ఉన్నారు. ఈ మేరకు నామినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు 'జీవితమే ఒక ఆట' అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో మూడు జోన్స్ ఉంటాయి. బ్యాగేజ్ జోన్, సేఫ్ జోన్, డేంజర్ జోన్. ఇందులో భాగంగా గ్యారేజ్‌లో నామినేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరి ఫోటోతో బ్యాగులుంటాయి. బిగ్‌బాస్‌ బజర్‌ మోగగానే వాళ్లు ఫాస్ట్ గా పరిగెత్తి ఇతరుల బ్యాగ్‌లను తీసుకుని, గార్డెన్‌లో ఉన్న కంచె రూమ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. చివరగా వెళ్లినవాళ్లు, వాళ్లు పట్టుకున్న బ్యాగ్‌పై ఉన్న ఫోటో గల వారు అర్హులు కారు, వారిలో ఒకరిని ముందుగా వెళ్లిన ఇతర సభ్యులు ఎలిమినేట్‌ చేయాల్సి ఉంటుంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: బిగ్‌బాస్ ట్విస్ట్.. మానస్ రుణం తీర్చుకున్న యానీ మాస్టర్

ఈ గేమ్‌లో భాగంగా మొదటి రౌండ్‌లో కాజల్‌ బ్యాగ్‌ పట్టుకున్న శ్రీరామ్‌.. కాజల్‌ని ఎలిమినేట్‌ చేశారు. సెకండ్ రౌండ్ లో జెస్సీ.. సన్నీ బ్యాగ్ తో లాస్ట్ లో రావడంతో ఇద్దరూ నామినేషన్ లో ఉండగా.. వీరిద్దరిలో హౌస్ మేట్స్ ఎక్కువ మంది జెస్సీని సేవ్ చేశారు. మూడో రౌండ్‌లో సిరి, జెస్సీలు ఉండగా, జెస్సీని ఎలిమినేట్‌ చేశారు. నాల్గో రౌండ్‌లో శ్రీరామ్‌, విశ్వ ఉండగా, విశ్వ ఎలిమినేట్‌ అయ్యారు. ఐదో రౌండ్‌లో రవి, సిరి ఉండగా, సిరి ఎలిమినేట్‌ అయ్యింది. ఆరో రౌండ్‌లో రవి, మానస్‌ ఉండగా, రవి ఎలిమినేట్‌ అయ్యాడు. ఏడో రౌండ్‌లో మానస్‌, శ్రీరామ్‌ ఉండగా, మానస్‌ ఎలిమినేట్ అయ్యారు. చివరగా యానీ మాస్టర్, శ్రీరామ్‌ మిగిలిపోయారు. వీరిలో యానీ మాస్టర్ని సేవ్‌ చేశారు ఇంటి సభ్యులు. దీంతో శ్రీరామ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: బిగ్‌బాస్ ట్విస్ట్.. మానస్ రుణం తీర్చుకున్న యానీ మాస్టర్

దీంతో తొమ్మిదో వారంలో అనీ మాస్టర్‌ నామినేషన్ల నుంచి సేవ్‌ అయ్యారు. ఈ సమయంలో హౌస్ మేట్స్‌కి బిగ్‌బాస్ షాకిచ్చాడు. గతంలో యానీ మాస్టర్‌కు హోస్ట్‌ ద్వారా లభించిన స్పెషల్‌ పవర్‌తో ఒకరిని నామినేషన్ నుంచి తప్పించవచ్చనే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో యానీ మాస్టర్‌ మానస్‌ని సేవ్‌ చేసింది. ఇందుకు రీజన్ కూడా చెప్పింది. గతంలో మానస్‌ తన కోసం లెటర్ త్యాగం చేసి.. డైరెక్ట్‌గా నామినేట్ అయ్యాడని అందుకే మానస్‌ని సేవ్ చేశానని యానీ చెప్పింది. ఫైనల్‌గా తొమ్మిదో వారం నామనేషన్లని ప్రకటించాడు బిగ్‌బాస్‌. యానీ మాస్టర్, మానస్‌ తప్పించి.. శ్రీరామ్‌, సన్నీ, విశ్వ, సిరి, కాజల్‌, జెస్సీ, రవి, ప్రియాంక ఈ వారం నామినేట్‌ అయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.