బీస్ట్ విడుదల : విజయ్ ఫ్యాన్స్ వీరంగం .. సినిమా నచ్చలేదంటూ, స్క్రీన్కు నిప్పు


Send us your feedback to audioarticles@vaarta.com


తమిళ అగ్ర కథానాయకుడు , ఇళయ దళపతి విజయ్ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన ‘బీస్ట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు నయనతారతో కోకిల, శివ కార్తికేయన్‌తో డాక్టర్ సినిమాలను తెరకెక్కించి సూపర్‌హిట్ సొంతం చేసుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ .. సూపర్‌స్టార్ విజయ్‌తో ఎలాంటి సినిమా చేస్తారోనని ఉత్కంఠ నెలకొంది. అయితే ‘బీస్ట్’ ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు ఓ రేంజ్‌కు చేరాయి. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఈరోజు బీస్ట్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్ర విడుదల నేపథ్యంలో తమిళనాట పండుగ వాతావరణం నెలకొంది. విజయ్ అభిమానులు వూరు వాడా సంబరాలు జరుపుతున్నారు. అయితే సినిమాకు తెల్లవారుజాము నుంచే నెగెటివ్ టాక్ వస్తోంది. సినిమా తమ అంచనాలను అందుకోలేకపోయిందని మండిపడుతున్నారు విజయ్ అభిమానులు. ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్తే చివరికి నిరాశతో బయటకు రావాల్సి వస్తోందంటూ పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఈ క్రమంలో తమిళనాడులోని ఓ థియేటర్లో సినిమా చూస్తున్న కొందరు అభిమానులకు బీస్ట్ సినిమా నచ్చలేదు. అంతే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే స్క్రీన్కు నిప్పంటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్న సంగతి తెలియాల్సి వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments