Balapur Laddu 2023 Price : అత్యధిక ధరకు బాలాపూర్ గణపతి లడ్డూ .. ఈసారి రికార్డు బద్ధలు


Send us your feedback to audioarticles@vaarta.com


11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవం ప్రారంభమైంది. ఇక ప్రసిద్ధ బాలాపూర్ లడ్డూ వేలంలో ఈసారి రికార్డు ధర పలికింది. ఈ ఏడాది లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. బాలపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభమైన మూడు దశాబ్ధాల కాలంలో ఇప్పుడే అది అత్యధిక ధర పలికింది. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం పాట ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
1994లో తొలిసారిగా బాలాపూర్ లడ్డూనూ వేలం వేయగా.. అప్పట్లో స్థానిక రైతు మోహన్ రెడ్డి రూ.450కు సొంతం చేసుకున్నారు. 17 ఏళ్ల పాటు గణేశుడి లడ్డూను స్థానికులే కొనుగోలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత స్థానికేతరులు లడ్డూను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు లడ్డూనే 28 సార్లు వేలం వేయగా.. 2020లో కరోనా మహమ్మారి నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు అందజేశారు. లడ్దూ వేలం పాట ద్వారా వచ్చిన మొత్తాన్ని ఉత్సవ సమితి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తోంది.
వేలం ప్రక్రియ అనంతరం బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేక వాహనంలో విఘ్నేశ్వరుడిని హుస్సేన్ సాగర్‌కు తరలిస్తున్నారు. చాంద్రాయణగుట్ట, షాలిబండ, ఫలక్‌నుమా, చార్మినార్ మీదుగా బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర హుస్సేన్‌సాగర్‌కు చేరుకోనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments