close
Choose your channels

మరోసారి ఆ డైరెక్టర్‌తో బాలయ్య..?

Sunday, November 29, 2020 • తెలుగు Comments

మరోసారి ఆ డైరెక్టర్‌తో బాలయ్య..?

బాలకృష్ణ తన 106వ సినిమాను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఏ సినిమా చేస్తారనే దానిపై వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో ఉంటుందని.. కాదు బాలకృష్ణ-పూరి కాంబినేషన్ లో ఉంటుందంటూ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత కోన వెంకట్ ఓ కథను బాలకృష్ణకు వినిపించారట. ఆయనకు కూడా కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఓకే చెప్పారని.. ఈ సినిమాను డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కిస్తాడని టాక్ వినిపిస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ ఇంతకు ముందు డిక్టేటర్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అంతా సవ్యవంగా జరిగితే మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నాయి సినీ వర్గాలు.

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా తాజా షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి అఘోరా పాత్ర. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్ పూర్ణ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

Get Breaking News Alerts From IndiaGlitz