close
Choose your channels

‘రూలర్’ ట్రైలర్ అదుర్స్..!

Sunday, December 8, 2019 • తెలుగు Comments

‘రూలర్’ ట్రైలర్ అదుర్స్..!

నందమూరి బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్ నటీనటులుగా కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం‘రూలర్‌’. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నందమూరి అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్, ట్రైలర్స్ అదుర్స్ అనిపించాయి. దీంతో డిసెంబర్-20 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్‌లో ఉన్నారు. అయితే రిలీజ్‌కు ముందు రూలర్ చిత్రబృందం ట్రైలర్ రిలీజ్ చేసింది.

డైలాగ్స్ అదుర్స్..
ట్రైలర్‌లో.. ‘ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తేలిగ్గా చావదు.. వెంటాడి వేటాడి చంపుద్ది’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. అయితే కచ్చితంగా మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చే అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మరోవైపు.. ‘ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే.. దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా’ అనే మరో డైలాగ్ కూడా ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.

లోకేష్ రియాక్షన్..!
రూలర్ ట్రైలర్‌పై బాలయ్య పెద్ద అల్లుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే.. దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు.. పొగరు ఉంటుందో చూపించమంటావా?. బాలా మావయ్యా! మీ డైలాగ్ సూపర్. టోటల్‌గా మీ సినిమా 'రూలర్' ట్రైలర్ అదుర్స్. దీన్నిబట్టి సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్ బాలా మావయ్యా!’’ అని ట్విట్టర్‌లో లోకేష్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు ట్రైలర్ యూ ట్యూబ్ లింక్‌ను కూడా జతచేశారు. కాగా ఈ ట్వీట్‌కు నందమూరి, నారా వీరాభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz