close
Choose your channels

రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో బాల‌కృష్ణ‌

Monday, January 27, 2020 • తెలుగు Comments

రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో బాల‌కృష్ణ‌

కొన్ని కాంబినేష‌న్స్‌పై సినీ ప్రేక్ష‌కుల్లో, అభిమానుల్లో భారీ అంచ‌నాలుంటాయి. అలాంటి క్రేజీ కాంబినేష‌న్స్‌లో బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను ఒక‌టి. బాల‌కృష్ణ‌ను ప‌క్కా మాస్ యాక్ష‌న్ హీరోగా తెర‌పై ప్రెజంట్ చేయ‌డంలో బోయ‌పాటి దిట్ట అనే పేరుంది. అందుకు ఉదాహ‌ర‌ణ‌లుగా సింహా, లెజెండ్ చిత్రాలు నిలిచాయి. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ తెర‌కెక్కుతోంది. గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఈ చిత్రాన్ని ఆధ్యాత్మిక అంశాల‌తో కూడిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా బోయ‌పాటి తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

బాల‌కృష్ణ రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్‌. ఒక పాత్ర ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో సాగుతుందని... మ‌రో కోణంలో బాల‌య్య అఘోరాగా క‌న‌ప‌డ‌తాడ‌ట‌. వార‌ణాసి నేప‌థ్యంలో వ‌చ్చే సీన్స్‌లో బాల‌కృష్ణ అఘోరాగా క‌న‌ప‌డ‌తాడ‌ని టాక్‌. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్స్ ఎంపిక‌తో పాటు.. లొకేష‌న్స్ ఎంపిక కూడా జ‌రుగుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమాలో పాత్ర కోసం బాల‌కృష్ణ బ‌రువు కూడా త‌గ్గారు. త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz