close
Choose your channels

భీష్ముడు పాత్ర‌లో బాల‌కృష్ణ‌

Wednesday, February 24, 2021 • తెలుగు Comments

భీష్ముడు పాత్ర‌లో బాల‌కృష్ణ‌

టాలీవుడ్‌లో అన్ని ర‌కాల జోన‌ర్స్ మూవీలు చేసిన అతి కొద్ది మంది నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. పౌరాణికం, జాన‌ప‌దం, సాంఘికం, చారిత్రాత్మ‌కం ఇలా అన్ని ర‌కాల సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి మెప్పించారాయ‌న‌. తాజాగా బాల‌కృష్ణ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని ఓ గెట‌ప్‌కు సంబంధించిన ఫొటో ఒక‌టి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇంత‌కీ ఆ లుక్ ఏంటో తెలుసా? మ‌హాభార‌తంలో కురువృద్ధుడైన భీష్ముడు. ఈ పాత్ర‌ను బాల‌కృష్ణ ఏ సినిమా కోసం వేశారంటే.. ‘య‌న్‌.టి.ఆర్‌’ బ‌యోపిక్ కోసం.

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్‌ను య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు, య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు అని రెండు భాగాలుగా తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన ఎన్నో గొప్ప పాత్ర‌ల‌కు సంబంధించిన గెట‌ప్పుల్లో బాల‌య్య క‌నిపించారు. అందులో భీష్ముడు పాత్ర ఒక‌టి. అయితే సినిమాలో ఎడిటింగ్ స‌మ‌యంలో ఆ లుక్‌ను తీసేశారు. మంగ‌ళ‌వారం భీష్మ ఏకాదశి కాబ‌ట్టి .. ఆ లుక్‌ను నిర్మాత‌లు విడుద‌ల చేశారు. భీష్ముడి పాత్ర‌లో అతికిన‌ట్టు స‌రిపోయిన బాల‌కృష్ణ‌ను చూసి ఆయ‌న ఫ్యాన్స తెగ సంబ‌ర‌ప‌డుతున్నారు. ఆ పొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz