close
Choose your channels

బోయపాటిపై కన్నెర్రజేసిన బాలయ్య.. ఎందుకంటే..!?

Friday, February 21, 2020 • తెలుగు Comments

బోయపాటిపై కన్నెర్రజేసిన బాలయ్య.. ఎందుకంటే..!?

నంద‌మూరి బాల‌కృష్ణ, బోయపాటి కాంబినేష‌న్‌లో ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల త‌ర్వాత మ‌రో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ న‌టిస్తోన్న 106వ చిత్రమిది. ఈ నెల 26 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తున్నదెవరు..? ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్లు ఒకరా ఇద్దరా..? నటీనటులెవరు..? ఎవరెవర్ని ఏయే పాత్రల్లో తీసుకుంటున్నారు..? అనే విషయాలు మాత్రం క్లారిటీ రాలేదు. అంతేకాదు.. హీరోయిన్ విషయంలో మాత్రం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ల వరకూ లెక్కలేనన్ని పుకార్లు షికార్లు చేశాయి. అయితే దాదాపు ఏడెనిమిది మంది హీరోయిన్లు నో చెప్పేశారని.. కొందరైతే డైరెక్టుగానే అబ్బే నేనే చేయట్లేదని తేల్చేశారట. ఇదిలా ఉంటే.. ఈ మధ్య సీనియర్ నటి.. ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన శ్రియను సంప్రదించగా.. మొదట ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత కుదరబ్బా.. డేట్స్ లేవ్ అని తేల్చేసిందిట.

సినిమా ఏ క్షణాన అనుకున్నారో ఏమో గానీ.. ప్రతిదీ అడ్డంకే.. ఇంతవరకూ హీరోయిన్ ఎవరనేది తేలకపోతే ఎలా..? ఇలాగైతే ఎలా..? అని బోయపాటిపై బాలయ్య ఒకింత కన్నెర్రజేశారట. అంతేకాదు.. హీరోయిన్స్ కరువయ్యారా..? కొత్త వారిని పట్టుకురా..? అని సలహా ఇచ్చారట. దీంతో సెట్స్‌పైకి వెళ్లేలేపు హీరోయిన్‌ను పట్టాలని బోయపాటి తెగ తిరుగున్నాడట. మరి ఎవర్ని ఫైనల్ చేస్తాడో ఏంటో..? మొత్తానికి చూస్తే బాలయ్య సరసన నటించాలంటే ఎవరూ ముందుకు రావట్లేదన్న మాట. ఒక్క బాలయ్యకే ఎందుకిలా జరుగుతోందో..? ఏంటో అని అభిమానులు ఒకింత అసంతృప్తికి లోనవుతున్నారట. ఫైనల్‌గా బాలయ్య-బోయపాటి సినిమా ఏ భామ వచ్చి వాలుతుందో..? ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలయ్యకు ఆ బ్యూటీ ఏ మాత్రం అచ్చొస్తుందో తెలియాలంటే హీరోయిన్ దొరికే వరకూ వేచి చూడాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz