Balagam : అంతర్జాతీయంగా సత్తా చాటుతోన్న బలగం.. లాస్ ఏంజెల్స్ వేదికగా రెండు అవార్డ్‌లు కైవసం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ‘బలగం’. అచ్చ తెలుగు కథతో , హృదయానికి హత్తుకునే కథనంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చక్కటి మౌత్ పబ్లిక్‌సిటీతో రోజురోజుకు ప్రేక్షకుల ఆదరణను సైతం పొందుతోంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత తెరకెక్కించగా.. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి కంటెంట్ వున్న సినిమాగా బలగం నిలిచింది. ఇప్పటికే మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తోన్న ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డు వేడుకలో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీలలో అవార్డులను కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని బలగం చిత్ర నిర్మాణ సంస్థ ‘‘దిల్‌రాజు ప్రొడక్షన్స్’’ ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు వేణు, సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణుకు అభినందనలు తెలిపింది.
సిరిసిల్లలో దావత్ చేసుకున్న బలగం టీమ్ :
ఇకపోతే.. బలగం టీమ్ ప్రస్తుతం మంచి జోష్‌లో వుంది. తెలుగు రాష్ట్రాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తోంది. అలాగే తమకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన బలగం టీమ్‌కు నిర్మాతలు దావత్ ఇచ్చారు. దర్శకుడు వేణు స్వస్థలమైన సిరిసిల్లకు సమీపంలోని ఓ గ్రామాన్ని ఎంచుకున్నారు. ఇక్కడే బలగం సినిమాలోని కాకిముట్టుడు సీన్ చిత్రీకరించారు. పార్టీ సందర్భంగా పొట్టేళ్లు, కల్లు తాగిన చిత్ర యూనిట్ చిందులు వేసింది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోను ఈరోజు అప్‌లోడ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
మా ఇంట్లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగానే కథ:
అయితే బలగం కథ విషయంలో వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కథ తనదేనంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ వాదిస్తున్నారు. గతంలో తాను రాసిన పచ్చికి టైటిల్‌తో రాసిన కథకు మార్పులు చేర్పులు తీసి బలగం మూవీ తీశారని సతీశ్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఫిలింనగర్‌లో పెద్ద చర్చకు దారి తీయడంతో దర్శకుడు వేణు మీడియా ముందుకు వచ్చారు. తన కుటుంబంలో జరిగిన సంఘటనల ఆధారంగా బలగం కథను రాసుకున్నానని వేణు చెప్పారు. తన తండ్రి మరణం తర్వాత ఈ పాయింట్ మెదిలిందని ఆయన తెలిపారు. తనది పెద్ద ఉమ్మడి కుటుంబమని, అందులో వంద మంది సభ్యులుంటారని వేణు తెలిపారు.
దిల్‌రాజు ముందుకు రాకుంటే .. ఈ పాయింట్ తెలిసేదా:
పక్షి ముట్టుడు అనేది తెలుగు సాంప్రదాయమన్న ఆయన.. తనకు కలిగిన ఆలోచనను ప్రదీప్ అద్వైత్‌తో కలిసి బలగం కథగా మలిచినట్లు వేణు వెల్లడించారు. అనంతరం దీనిని జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌కు చెప్పానని.. అలాగే పక్షి ముట్టుడుపై లోతుగా అధ్యయనం చేశానని .. సతీష్ రాసిన కథను తాను చదవలేదన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలపై ఒక్కొక్కరు ఒకలా కథలు రాశారని వేణు పేర్కొన్నారు. తన కథను వాడుకున్నానని అంటున్న సతీష్ అప్పుడే రచయితల సంఘంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని వేణు ప్రశ్నిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను తీయకుంటే తెలంగాణ సంస్కృతిలోని ముఖ్య విషయం బయటి ప్రపంచానికి తెలిసేది కాదన్నారు. తమ సినిమా కారణంగా మరిన్ని మంచికథలు రాబోతున్నాయని వేణు ఆకాంక్షించారు. దిల్‌రాజు బొమ్మ పెట్టుకుని సతీష్ చిల్లర వ్యాపారం చేస్తున్నారని.. ఆయన దమ్ముంటే తనతో మాట్లాడాలని , అప్పుడు చెబుతానని వేణు పేర్కొన్నారు.
Balagam shines on the global stage! 🤩❤️
— Dil Raju Productions (@DilRajuProdctns) March 30, 2023
Congratulations to our director @VenuYeldandi9 and our cinematographer @dopvenu for winning the prestigious Los Angeles Cinematography Awards. 👏🏻👏🏻
Running successfully in theatres near you🙌@priyadarshi_i @kavyakalyanram pic.twitter.com/gCEhvEXLYR
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments