close
Choose your channels

బద్రి హీరోయిన్ సెక్సీ షో.. ఇంటర్నెట్ లో దావానలం

Saturday, June 12, 2021 • తెలుగు Comments

అమీషా పటేల్ బద్రి చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన బద్రి సూపర్ హిట్ కావడంతో మంచి క్రేజ్ దక్కింది ఈ బ్యూటీకి. ఆ తర్వాత అమీషాకు తెలుగులో అవకాశాలు వచ్చాయి కానీ సక్సెస్ దక్కలేదు. అమీషా నటించిన నాని, నరసింహుడు, పరమవీర చక్ర చిత్రాలు నిరాశపరిచాయి.

టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గినప్పటికీ బాలీవుడ్ వరుసగా చిత్రాలు చేస్తూనే ఉంది. కెరీర్ ఆరంభంలో అందాలు ప్రదర్శన పొదుపుగా చేసిన అమీషా ఇప్పుడు మాత్రం రెచ్చిపోతోంది. ఆ రెచ్చిపోవడం అలా ఇలా కాదు.. ఆమె బోల్డ్ షో ఎలా ఉంటుందో తెలియాలంటే ఇన్స్టాగ్రామ్ ఖాతా చూడాల్సిందే.

తాజాగా అమీషా పటేల్ షేర్ చేసిన సెక్సీ పిక్స్ ఇంటర్నెట్ లో దావానలంలా వ్యాప్తిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. గ్రీన్ అండ్ వైట్ లైన్స్ ఉండే డ్రెస్ లో అమీషా ఎక్స్ ఫోజింగ్ నెవర్ బిఫోర్ అనేవిధంగా ఉంది.

అమీషా వివిధ కంపెనీల ప్రొడక్ట్స్ కి ఇన్స్టాగ్రామ్ లోనే ప్రచారం కల్పిస్తోంది. ప్రస్తుతం అమీషా హిందీతో పాటు పంజాబీలో కూడా నటిస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz