close
Choose your channels

చిరు అల్లుడితో చిన్నారి పెళ్లి కూతురు!!

Thursday, March 12, 2020 • తెలుగు Comments

చిరు అల్లుడితో చిన్నారి పెళ్లి కూతురు!!

తెలుగు ప్రేక్ష‌కుల‌కు చిన్నారి పెళ్లి కూతురు అనే అనువాద సీరియ‌ల్‌తో పరిచ‌య‌మైన అవికాగోర్.. తొలిసారి రాజ్‌తరుణ్‌తో క‌లిసి ఉయ్యాల జంపాలా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన ఈ బ్యూటీ త‌రువాత మ‌రికొన్ని సిన‌మాల్లోనూ న‌టించింది. అయితే ఈమె కేవ‌లం ఓ రేంజ్ యూత్ హీరోల సినిమాల‌కే ప‌రిమిత‌మైంది. ఆలోపు ఈమెకు సినిమా ఫీల్డ్ గురించి మ‌రింత లోతుగా తెలుసుకోవాల‌నే కోరిక రావ‌డంతో సినిమాల‌కు గ్యాప్ ఇచ్చేసి స్క్రిప్ట్ రైటింగ్‌, ద‌ర్శ‌క‌త్వ విభాగాల్లో శిక్ష‌ణ తీసుకుంది.

చిరు అల్లుడితో చిన్నారి పెళ్లి కూతురు!!

మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డుకి తెలుగులో రాజుగారిగ‌ది 3 చిత్రంతో అవ‌కాశం త‌లుపు త‌ట్టింది. అయితే ఆ సినిమా అనుకున్నంత‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో అవికాగోర్ మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. అయితే సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్‌దేవ్ హీరోగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సినిమాలో అవికాగోర్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. రీసెంట్‌గా క‌థ విన్న అవికా గోర్ సినిమాలో న‌టించ‌డానికి ఓకే చెప్పింద‌ట‌. పాత్ర కోసం బ‌రువు కూడా త‌గ్గ‌డానికి అవికా ఓకే చెప్పేసింద‌ని అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.

Get Breaking News Alerts From IndiaGlitz