close
Choose your channels

ప్రకాశం జిల్లాలో ఆటో డ్రైవర్ వీరంగం.. సైకోలా మారి..!

Friday, July 12, 2019 • తెలుగు Comments

ప్రకాశం జిల్లాలో ఆటో డ్రైవర్ వీరంగం.. సైకోలా మారి..!

ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని మార్టూరు గ్రామం వద్ద మెయిన్ సెంటర్‌లో ఓ ఆటో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. శుక్రవారం నాడు ఆటోడ్రైవర్ రచ్చతో విసిగిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఆ ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతడు పోలీసులను సైతం లెక్కచేయకపోవడం గమనార్హం. రోడ్డుపై వస్తున్న బస్సులు, కార్లకు ఎదురెళ్తూ వాటిని ఢీ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆయన వింత ప్రవర్తనతో రోడ్డుమీదికి వెళ్లాలంటే వాహనదారులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అయితే ఆటో డ్రైవర్ల మధ్యే గొడవ అతని అలా మారడానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ గొడవతో ఆ ఆటో డ్రైవర్‌ ఒక సైకో మాదిరిగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు మీడియా తెలిపారు. వింతగా ప్రవరిస్తున్న ఆయన ప్రవర్తనను చూసి స్థానిక ప్రజలు భయపడుతూ బతుకుతున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుంటే గానీ మేం ఇక్కడ ఉండలేమంటూ స్థానికులు, వాహనదారులు చెబుతున్నారు. అయితే ఈ ఆటో డ్రైవర్‌ వ్యవహారంలో పోలీసులు ఏం చేయబోతున్నారో మరి.

Get Breaking News Alerts From IndiaGlitz