close
Choose your channels

హైదరాబాద్‌లో ఏటీఎం కార్డుల క్లోనింగ్‌ ముఠా అరెస్టు

Wednesday, March 18, 2020 • తెలుగు Comments

జల్సాలకు అలవాటు పడ్డ దుండగులు రోజురోజుకూ ప్లాన్‌లు మార్చేసి సరికొత్త పంథాలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాకు సైబరాబాద్ పోలీసులు చుక్కలు చూపించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఒడిశా ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించడం జరిగింది. కాగా.. నగరంలోని పలు రెస్టారెంట్లు, పబ్బులలో ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముగ్గురు నిందితులను ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. అయితే.. గచ్చిబౌలి హెచ్‌డీఎఫ్‌సీ మేనేజర్ ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు అరెస్ట్ చేసి 140 క్లోనింగ్‌ ఏటీఎం కార్డుల సాయంతో రూ. 13 లక్షలు విత్‌ డ్రా చేసినట్లు తెలుసుకున్నారు. నిందితుల నుంచి రూ. 10 లక్షలతో పాటు స్కిమర్‌, క్లోనింగ్‌ మిషన్‌, 44 క్లోన్డ్‌ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని మీడియాకు వివరాలు వెల్లడించారు.

కాగా. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు ప్రఫుల్ కుమార్ అని పోలీసులు గుర్తించారు. స్కిమర్, క్లోనింగ్ మిషన్ లను కొనుగోలుచేసి హై క్లాస్ రెస్టారెంట్లు, పబ్‌లలో వెయిటర్‌లుగా చేరి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కస్టమర్ బిల్లులు చెల్లించేటప్పుడు తమ వెంట తెచ్చుకున్న స్కిమర్ సహాయంతో కార్డులోని డేటాను దొంగిలించి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతుండేవారని తేలింది. అనంతరం ఆ డేటా సహాయంతో డబ్బులు విత్ డ్రా చేసుకునేవాళ్లని ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. కాగా ఈ అరెస్ట్ ఘటనకు సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz