close
Choose your channels

ఆటా స్పోర్ట్స్ ఈవెంట్‌కు అనూహ్య స్పందన.. ఇదే జోష్ కంటిన్యూ చేయాలన్న నిర్వాహకులు

Wednesday, May 11, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తెలుగు వారి అభ్యున్నతి, సంక్షేమం కోసం పాటుపడుతున్న సంస్థల్లో ‘‘ఆటా’’ ముందు వరుసలో వుంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ డీసీ మేరిల్యాండ్ & వర్జినీయా రాష్ట్రాలలో వుంటున్న తెలుగు వారిని ప్రోత్చహించటం కోసం స్త్రీ, పురుషులకు ప్రత్యేక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మే 7 (శనివారం) వర్జీనియాలో పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రో బాల్ , వాలీబాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీలకు అమెరికా నలుమూలల నుండి మంచి స్పందన లభించింది. ఇతర రాష్ట్రాల నుండి కూడా పలు జట్లు ఈ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చాయి.

ఈ సందర్భంగా టీమ్ షో స్టాపర్లు డివిజన్ 1 వాలీబాల్ కప్‌ను పురుషులు గెలుచుకోగా.. కంట్రీ ఓవెన్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. డివిజన్ 2లో, సూపర్ స్ట్రైకర్స్ జట్టు టైటిల్ గెలుచుకోగా, VASH vacations 2వ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో నార్త్ కరోలినా నుండి వచ్చిన స్పోర్టి దివాస్ డివిజన్ 1.. త్రో బాల్ పోటీలో గెలుపొందగా, VA రాకర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. డివిజన్ 2లో రిచ్‌మండ్ స్మాషర్లు విజయం సాధించగా.. షార్లెట్ స్ట్రైకర్లు 2వ స్థానంలో నిలిచారు. గెలుపొందిన జట్లకు ఆటా అధ్యక్షుడు భువనేష్ భుజాల బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇదే ఉత్సాహంతో అన్ని క్రీడలు, కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆటా కన్వెన్షన్ కన్వీనర్ సుధీర్ బండారు సైతం విజేతలకు అభినందనలు తెలిపారు. అలాగే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆటా కన్వెన్షన్ స్పోర్ట్స్ టీమ్, వాలంటీర్లకు సుధీర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆటా కాన్ఫరెన్స్ నిర్వహకులు శ్రవణ్ పాడూరు, రవి బొజ్జ, అమర్‌పాశ్య, కౌశిక్ సామ, ఆటా 17వ మహసభలకు కో హోస్ట్‌గా వ్యవహారిస్తున్న రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) అధ్యక్షులు సతీష్ వద్ది మాట్లాడుతూ జులై 1 నుంచి 3 వరకు వాషింగ్టన్‌లో జరగబోయే 17వ ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్‌కి ఇదే ఉత్సాహంతో పాల్గోని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇకపోతే.. వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరగనున్న ఆటా 17వ మహాసభలకు ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, అన్ని కమిటీల సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 15000 మంది హాజరవుతారని అంచనా. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్, "Daaji" కమలేష్ పటేల్ , ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ, సినీ ప్రముఖులు, హీరోలు విజయ్ దేవరకొండ , "DJ Tillu" సిద్దు, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, 1983 ప్రపంచకప్ జట్టు సభ్యులు కపిల్ దేవ్, గవాస్కర్, గాయకుడు రాం మిరియాల, నేపథ్య గాయనీ మంగ్లీ, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ హాజరుకానున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు పద్మవిభూషణ్ ఇళయరాజాతో సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.