close
Choose your channels

అరియానా హైడ్రామా.. సొహైల్‌పై ముద్ర..

Thursday, December 10, 2020 • తెలుగు Comments

అరియానా హైడ్రామా.. సొహైల్‌పై ముద్ర..

టాస్క్‌లో భాగంగా సొహైల్ కుర్చీపై కూర్చొన్న సీన్‌తో షో స్టార్ట్ అయింది. ఇవాళ కూడా అరియానా రచ్చ స్టార్ట్ చేసింది. నా బట్టలు స్విమ్మింగ్ పూల్‌లో ఎందుకు వేశావు? నా బొమ్మేం చేసింది నీకు? అంటూ మనసులోదంతా కక్కేసింది. టాస్క్‌లో భాగంగా చేసినదాన్ని మనసులో పెట్టుకుని ఒక రకంగా టార్చర్ చేసింది. తను కెప్టెన్‌గా ఉన్న రోజుల్ని మరోసారి అరియానా గుర్తు చేసింది.అయినప్పటికీ సొహైల్ చాలా ఓపికగా కూర్చొన్నాడు. ఎలాంటి ఎమోషన్స్ కనబరచకపోవడంతో అఖిల్ సొహైల్‌కు జీరో మిస్టేక్స్ అని వేశాడు. బజర్ మోగిన తర్వాత సొహైల్ కూడా స్టార్ట్ చేశాడు. నేను రివెంజ్ తీర్చుకునేందుకే అలా చేశానని సొహైల్ చెప్పాడు. రెండు మాటలన్నదానికి మోనాల్‌పై రివేంజ్ తీర్చుకున్నావని చెప్పాడు. నువ్వు మోనాల్ నెత్తిపై గుడ్డు కొడితే లేదు కానీ ఆమె బొమ్మ విసిరేస్తే వచ్చిందా? అని సొహైల్ రివర్స్ అయ్యాడు. టీ స్టాండ్ టాస్క్‌లో టార్చర్ పెట్టింది గుర్తు లేదా? అని సొహైల్ మంచి మంచి పాయింట్స్ తీసి అడిగాడు. తరువాత హారిక కూర్చొంటే అభి, సొహైల్ నవ్వించడానికి ట్రై చేశారు. సొహైల్ వచ్చి అఖిల్ చెప్పిన మాటల కారణంగానే తాను టాస్క్‌ను మంచిగా ఆడానని.. అదీ సొహైల్ గాడి ఫ్రెండ్‌షిప్ అని చెప్పాడు. మళ్లీ సొహూల్ అరియానా దగ్గరకు వెళ్లి ఒకరకంగా ఇష్యూని సాల్వ్ చేసుకునే రీతిలో మాట్లాడాడు కానీ అరియానా మాత్రం దానిని కూడా సీరియస్‌గానే తీసుకుంది. ఈ నేపథ్యంలో అరియానాకు, సొహైల్‌కు మధ్య ఓ రేంజ్‌లో గొడవ జరిగింది. సొహైల్‌లో అరియానా చేసిన దానికి కోపం ఉప్పొంగింది. అఖిల్.. వారించడానికి ట్రై చేశాడు.

అరియానా హైడ్రామా.. సొహైల్‌పై ముద్ర..

ఎలాగో అభి, అఖిల్ కలిసి సొహైల్‌ని వారించారు. ఇక అరియానా కెమెరా ముందు గట్టి గట్టిగా అరిచి గోల చేసింది. తరువాత నా వల్ల కావడం లేదంటూ ఏడుపు మొదలు పెట్టింది. అభి వచ్చి అరియానాను ఓదార్చాడు. సొహైల్‌ని మాట్లాడవద్దని అఖిల్ చెప్పాడు. ఫైనల్‌గా అభి.. హారికను నవ్వించాడు. అభి కూర్చొని మళ్లీ కిందకు దిగాడు. మళ్లీ వెళ్లి కూర్చొన్నాడు. అందరూ కలిసి వెళ్లి అభిని ఆట పట్టించారు. హారిక.. అభిని నవ్వించింది. బజర్ మోగగానే అభి వెళ్లి హారికను కొట్టాడు. తరువాత ఈ టాస్క్ విన్నర్‌గా సొహైల్‌ను అఖిల్ ప్రకటించాడు. ఎంటర్‌టైన్‌మెంట్ నీ దానిలోనే వచ్చిందని సొహైల్ అభికి చెప్పాడు. తరువాత సొహైల్ వెళ్లి ప్రేక్షకులకు తనకు ఓటు చేయమని అర్థించాడు. తను 18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనకు ఇప్పటి వరకూ గుర్తింపు లేదని.. అది బిగ్‌బాస్ ద్వారానే వచ్చిందని చెప్పాడు. సొహైల్ ఓటు కోసం ప్రేక్షకులను అర్థించిన తీరు చాలా బాగా ఆకట్టుకుంది. కెమెరాలున్నాయని నటించడం రాదని చెప్పాడు. బయట అరియానా ఓవర్ యాక్షన్ మళ్లీ మొదలు పెట్టింది. ఒక అబ్బాయి తన మీదకు అగ్రెసివ్‌గా రావడాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నానని చెప్పింది. సొహైల్ నా మీద మీదకు వచ్చాడని చెప్పింది. నువ్వు కూడా సొహైల్ పైపైకి గొడవకు వెళ్లావని సొహైల్‌పై ముద్ర వేయవద్దని అఖిల్ చెప్పాడు. నేను మధ్యలో ఉన్నా కదా అని అఖిల్ చెప్పాడు. కొంచెం ఉన్న దీనికి ఓ రేంజ్‌లో గొడవకు నువ్వే లేచావని అఖిల్ చెప్పాడు. టక్కుమని పడిపోయి ఏడవడం ఏంటని అఖిల్ ప్రశ్నించాడు. సొహైల్ ఒక అమ్మాయిపై అలా వెళ్లి గొడవ చేయడానికి వాడు పిచ్చోడేం కాడని చెప్పాడు.

అరియానా హైడ్రామా.. సొహైల్‌పై ముద్ర..

బయట ఇదే టాపిక్ మాట్లాడి మళ్లీ అదే టాపిక్ మాట్లాడావని చెప్పాడు. సొహైల్ బిగ్‌బాస్‌తో మాట్లాడాడు. తను చేసింది టాస్కేనని చెప్పాడు. కానీ అరియానాతో గొడవ చాలా ఫీలయ్యానని చెప్పాడు. రాక్షసుడు టాస్క్‌లో పచ్చడి తీసుకొచ్చి నా మొహాన రాసిందని చెప్పాడు. తనకు కోపం తప్ప మరొకటి లేదని చెప్పాడు. ఈ టైటిల్ కొట్టడం తనకు చాలా ఇంపార్టెంట్ అని.. తన పేరెంట్స్ ఎదురు చూస్తున్న గోల్ అంటూ సొహైల్ బాగా ఎమోషనల్ అయ్యాడు. అరియానాతో గొడవ పెట్టుకోవాలని తనకు లేదని కానీ అలా జరిగిపోతోందంటూ బాగా ఫీలయ్యాడు. సొహైల్‌కు బిగ్‌బాస్ కాస్త ధైర్యం చెప్పడంతో చిన్న పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు ఓడిపోతే నేనిక నీతో మాట్లాడనురా అని అఖిల్ అన్నాడని అందుకే తాను ఎలాంటి ఎమోషన్స్ లేకుండా కూర్చొన్నానని చెప్పాడు. మీ ఆటను ఇలాగే కొనసాగించాలని బిగ్‌బాస్ సొహైల్‌కు చెప్పాడు. నువ్వు ఇక్కడ మాట్లాడవద్దన్నావు కదా.. నాకు ఎవరితో మాట్లాడాలో తెలియలేదని చెప్పి హౌస్‌లోకి వెళ్లి కెమెరాతో మాట్లాడానని సొహైల్ వెళ్లి అఖిల్‌కు చెప్పాడు. అఖిల్ కూడా సొహైల్‌ను హగ్ చేసుకుని ధైర్యం చెప్పాడు. మోనాల్ కూడా వచ్చి సొహైల్‌ను హగ్ చేసుకుని ధైర్యం చెప్పింది. మొత్తానికి ఇవాళ్టి షోలో రచ్చ ఓ రేంజ్‌లో నడిచింది. రేపటి ప్రోమోను బట్టి షో చాలా ఫన్నీగా జరగనుందని తెలుస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz